సూర్య హీరోగా నటించిన చిత్రం గజిని( Ghajini ).ఈ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 20 సంవత్సరాలు పూర్తి అయింది.
ఈ సినిమాను ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేరు.ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు.
ఈ సినిమా సూర్య( Surya ) కెరీర్ ని కూడా బాగా మలుపు తిప్పిన విషయం తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సూర్యకు భారీగా మార్కెట్ను తెచ్చిపెట్టింది.
ఏఆర్ మురగదాస్ అనే దర్శకుడిని అమీర్ ఖాన్ తో రీమేక్ చేసేలా ప్రేరేపించింది.అయితే ఇదంతా జరిగి రెండు దశాబ్దాలు అయిపోయింది.
ఈ సినిమాకు సీక్వెల్ గా గజినీ 2 సినిమా( Ghajini 2 movie ) రావాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగాని ఆ ఆలోచనలు చేస్తున్నట్టుగాని ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు.కానీ ఈ మధ్య దీని హిందీ రీమేక్ నిర్మించిన అల్లు అరవింద్ నోట సీక్వెల్ ప్రస్తావన వస్తోంది.నిన్న ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ ( Tandel trailer )ఈవెంట్ లోనూ అది బయట పెట్టారు.
అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా రావడంతో ఆయన ముందే తన కోరికను బహిర్గతం చేశారు.అయితే గజిని 2 చాలా రిస్క్ తో కూడుకున్నది.ఏ మాత్రం తొందరపడినా బ్రాండ్ దెబ్బ తింటుంది.శంకర్ భారతీయుడుని ఇలా చేయబోయే ట్రోలింగ్ బారిన పడ్డారు.
అనవసరంగా క్లాసిక్ చెడగొట్టారని కమల్ హాసన్ అభిమానులే విరుచుకుపడ్డారు.

ఇది ఎంత డ్యామేజ్ అంటే మొదటి భాగాన్ని చూడని వారికి సైతం దాని మీద ఆసక్తి పోయేంతగా మరి గజిని 2 విషయంలోనూ ఈ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది.కాబట్టి గజినీ 2 సినిమా రావాలి అంటే లెక్కలు చూసుకోవాలి.అంతేకాకుండా కథను సిద్ధం చేసుకోవాలి.
ఇవన్నీ జరగాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది.ఇంత రిస్కు తీసుకోలేక చాలామంది ఈ విషయం గురించి తీసుకురావడం లేదు అని కూడా తెలుస్తోంది.
అయితే గజినీకి సినిమాకు సీక్వెల్ గా అంటే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా రావడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం అన్నది కాస్త సందేహించాల్సిన విషయం అని చెప్పాలి.
కాబట్టి ఈ ఆలోచనను అభిమానులు విరమించుకోవడం మంచిదని చెప్పాలి.