చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి( Naga Chaitanya, Sai Pallavi ) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఇకపోతే హీరో నాగచైతన్య ఈ సినిమాతో ఎలా అయినా సక్సెస్ కొట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే.
గత సినిమాలు ఊహించిన విధంగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా పైన హోప్స్ పెట్టుకున్నారు నాగచైతన్య.లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ( Geetha Arts Banner )పై బన్నీ వాసు నిర్మించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.తండేల్ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.ఈ సినిమా ఫైనల్ రన్ టైంని 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేశారు.ఇక ఈ మూవీ సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉంది.వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను దర్శకుడు చందు మొండేటి తెర మీదకు తీసుకువచ్చిన విధానం బాగుందని అంటున్నారు.

ప్రేమ కథను, దేశ భక్తిని ముడిపెడుతూ హృదయానికి హత్తుకునేలా సినిమాని మలిచాడని తెలుస్తోంది.నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ప్రేమ సన్నివేశాలు, జాతర ఎపిసోడ్, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయట.దేశభక్తితో ముడిపడిన సినిమా కావడంతో, ఎమోషన్స్ వర్కౌట్ అయితే తెలుగులోనే కాకుండా, హిందీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.