తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు( Dil Raju ) ఒకరు.ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉన్నారు.
ఇకపోతే ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ).సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.దాదాపు 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాత దిల్ రాజు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా తనకు ఒక పెద్ద గుణపాఠం నేర్పిందని తెలియజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా కాంబినేషన్స్ అంటూ పూర్తిస్థాయిలో తడబడ్డామని కానీ ఈ సినిమా మమ్మల్ని దారిలోకి తెచ్చిందని దిల్ రాజు తెలిపారు.

మా బ్యానర్లో అనిల్ రావిపూడి సుమారు ఆరు సినిమాలు చేశారు.ఈ ఆరు సినిమాల విషయంలో మేము ఎప్పుడూ కూడా ఎక్కడ ఒత్తిడికి ఫీల్ అవ్వలేదని దిల్ రాజు తెలిపారు.పడిపోతున్న మమ్మల్ని ఈ సినిమాతో అనిల్ పైకి తీసుకొచ్చాడని కొనియాడారు.
కొవిడ్ నుంచి గతుకురోడ్డుపై ప్రయాణిస్తున్న వాళ్లని తారు రోడెక్కించాడన్నారు.మరో 10 సంవత్సరాల పాటు మాకు ఎలాంటి డోకా ఉండదు.
విజయాలన్ని మాకే సొంతం అంటూ ధీమా వ్యక్తం చేశారు.ఇక సినిమాలను చేయాలి అంటే బడ్జెట్ ముఖ్యం కాదని కథ ముఖ్యం అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.