ఈ రోజులలో పని మనిషి (Maid) సంస్కృతి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.బిజీ జీవనశైలి కారణంగా ప్రజలు ఇంట్లో వంట చేసేందుకు కూడా తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు.
దీంతో ఎక్కువ మంది పనిమనిషులను ఉపాధి పొందండం సాధారణమైపోయింది.అయితే, నమ్మి పనిని అప్పగించిన పని మనిషులే ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజాగా, ఓ పని మనిషి (Maid)వంటగదిలో రోటీలు దొంగిలిస్తున్న(Stealing rotis) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఆమె వండుతున్న వేడివేడి రోటీలను బ్లౌజ్‌లో దాచిపెట్టింది.
కేవలం రెండు, మూడు రోటీలే కాకుండా.మొత్తం 5-6 వేడి రోటీలను బ్లౌజ్‌లో(blouse) చుట్టిపెట్టుకుని దుపట్టాతో కప్పేసి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
ఇది మాత్రమే కాకుండా, ఇదే పని మనిషి ఇంతకుముందు పనిచేసిన ఇంట్లో కూడా ఆహార పదార్థాలను దొంగిలించినట్టు తెలుస్తోంది.ఈ మొత్తం ఘటన వంటగదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో(CCTV Camera) రికార్డ్ అయ్యింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.పనిమనిషి నమ్మకద్రోహంపై నెటిజన్లు విస్తుపోతూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పని మనిషులు కేవలం భోజనాన్ని దొంగిలించడం మాత్రమే కాకుండా, కొన్ని సందర్భాల్లో వంటలో అశుద్ధమైన పదార్థాలను కలుపుతున్న సంఘటనలు బయటకు వచ్చాయి.ఆహారంలో ఉమ్మివేయడం, మూత్రం కలపడం వంటి ఘటనలు అప్పట్లో వైరల్ అయ్యాయి.ఇప్పుడు ఆ స్థాయిని దాటి వారే ఇంటికి సరిపడా భోజనం దొంగిలించుకోవడం ప్రారంభించారు.
పని మనిషితో జాగ్రత్తలు తీసుకోవాలి.మీ ఇంట్లో మీరు కూడా పని మనిషిని నియమించినట్లయితే, జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.సీసీటీవీ కెమెరాలు వంటగదిలో అమర్చితే, ఇలాంటి సంఘటనలు ముందుగా గుర్తించవచ్చు.
పనిమనిషి నమ్మకస్తురాలని నిర్ధారించుకునేలా పూర్తి వివరాలతో నియామక ప్రక్రియ జరపాలి.ఆహార పదార్థాలు, ముఖ్యమైన వస్తువులను గమనించాలి.
ఇంట్లో ఏమేమి కోల్పోతున్నాయో గమనించాలి.ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే, వెంటనే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.మీ ఇంట్లో పని మనిషి వ్యవహారంపై మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
.