టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.బాలయ్య వరుసగా 4 విజయాలను ఖాతాలో వేసుకోగా ఈ స్టార్ హీరో భవిష్యత్తు సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అయితే నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) బాలయ్యను నీకు మ్యాన్షన్ హౌజ్ కు ఏంటి అంత సంబంధం అని అడగగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బాలయ్య మాట్లాడుతూ నా లైఫ్ లో అన్నీ యాదృచ్ఛికంగా జరిగాయని మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాంటిదేనని అన్నారు.
అంతే తప్ప మ్యాన్షన్ హౌజ్ తో ప్రత్యేకమైన అనుబంధం లేదని బాలయ్య చెప్పుకొచ్చారు.అది నన్ను ప్రేమించిందంతేనని వసుంధర,( Vasundhara ) మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్లు అని బాలయ్య పేర్కొన్నారు.
నాన్న అప్పట్లో నాకో పెద్ద ఇల్లు కట్టించారని ఆ ఏరియాలో అదే మొదటి ఇల్లు అని బాలయ్య తెలిపారు.

ఆ ఇల్లు తనకు మ్యాన్షన్ తో సమానమని ఆ మ్యాన్షన్ లో మ్యాన్షన్ హౌజ్ ఉంటుందని బాలయ్య కామెంట్లు చేశారు.బాలయ్యకు తాజాగా నారా భువనేశ్వరి పార్టీ ఇవ్వగా ఆ పార్టీలో బాలయ్య ఈ కామెంట్లు చేయడం జరిగింది.బాలయ్య ఎంచుకునే కథల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ అఖండ సీక్వెల్ పై( Akhanda Sequel ) అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.35 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న బాలయ్య ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య సీనియర్ హీరోలలో టాప్ హీరోగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.