ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు రక్తహీనత( anemia ) సమస్యతో బాధపడుతున్నారు.ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
దీంతో చాలామంది ఒంట్లో రక్తాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.ముఖ్యంగా మహిళలలో రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల వాళ్లకు రక్తహీనత సమస్య వస్తూ ఉంటుంది.
మరి కొందరిలో ఇతర సమస్యల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది.అయితే మన ఇంట్లోనీ వంటింటి చిట్కాలను ఉపయోగించి శరీరంలో రక్తాన్ని పెంచుకోవచ్చు.
ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేకుండా జ్యూస్ లతోనే రక్తాన్ని పెంచుకోవచ్చు.మరి దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మగవారిలో 13.5 నుంచి 16.5 గ్రాముల గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి.మహిళలకు అయితే 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటే సరిపోతుంది.
ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి.

మన ఒంట్లో రక్తం పెరగాలంటే మన శరీరంలో కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి.మహిళలకు ప్రతి రోజు 30 గ్రాములు ఐరన్ అవసరం అవుతుంది.పురుషులకు అయితే రోజుకు 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది.
అలాగే తినే ఆహారంలో ప్రతిరోజు ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి.రక్తం త్వరగా పెరగాలి అంటే ప్రతిరోజు ఉదయం క్యారెట్ జ్యూస్ ( Carrot juice )తాగుతూ ఉండాలి.
ఇంకా చెప్పాలంటే పండ్ల రసాలు, క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్ళు అయితే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ( Beetroot juice )కూడా తాగవచ్చు.ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్రూట్, టమోటా, కీరదోసతో కూడా జ్యూస్ చేసుకుని తాగవచ్చు, ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె( Dry date powder, honey ) కలుపుకొని తాగితే ఎంతో మంచిది.ఇలా ప్రతి రోజు తాగితే ఒంట్లో రక్తం అమాంతంగా పెరుగుతుంది.
ఒక వేళ గోధుమ గడ్డి పొడి దొరికిన దాన్ని కూడా కలుపుకొని తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.అలాగే సాయంత్రం పూట ఏదైనా ఒక జ్యూస్ కానీ కమల పండు జ్యూస్ అయినా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.