పైనాపిల్.దీన్ని అనాస పండు అని కూడా అంటారు.
కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉండే పైనాపిల్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ముఖ్యంగా ఈ సీజన్‌లో పైనాపిల్స్ విరివిగా దొరుకుతుంటాయి.
ఏ, బీ, సీ విటమిన్స్ ఫుస్కలంగా ఉండే పైనాపిల్.శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
అలాగే పైనాపిల్‌తో గుండె జబ్బులు, క్యాన్సర్, రక్తపోటు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అయితే పైనాపిల్ చర్మ సౌందర్యానికి కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు.
నేటి కాలంలో యువతీ, యువకులు ప్రధానంగా ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఇది కూడా ఒకటి.ఎన్ని ప్రయోగాలు చేసినా మొటిమలు మాత్రం తగ్గవు.
అలాంటి వారు పైనాపిల్ జ్యూస్ తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
రెండొవది.
పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసుకుని.అందులో పెరుగు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు పోయి.
చర్మం ప్రకాశవంతంగా, అందంగా మారుతుంది.
మూడొవది.
పైనాపిల్ ముక్కలను పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా బాదం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట లేదా అర గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోయి.
యవ్వనంగా మారుతుంది.అలాగే చర్మం మంచి కలర్ కూడా సంతరించుకుంటుంది.