సోషల్ మీడియా(Social media) యుగం రాజ్యామేలుతోంది.నేడు పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్(Smart phone) అనేది కొలువుదీరింది.
దాంతో సోషల్ మీడియా హవా ఆటోమేటిగ్గా పెరిగిపోయింది.ఈ క్రమంలో అగ్ర స్థానాన్ని సంపాదించింది.
పైగా ఇపుడు ప్రతి ఒక్కరికీ తాము వాడుతున్న ఫోన్లోనే కెమెరా ఫీచర్ ఇండడంతో తమ జ్ఞాపకాలను వీడియో తీసి సోషల్ మీడియా వేదికల్లో పెట్టడం సర్వ సాధారణం అయిపోయింది.మరికొందరు వ్యూస్ కోసం, రీచ్ కోసం వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఏదైనా వీడియోకు వ్యూస్ వచ్చి కొంచెం పాపులారిటీ వస్తే చాలు.ఇక తమకు తాము సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ట్యాగ్ ను తగిలించుకొని చాలా అతి చేస్తూ ఉంటారు.
విషయం ఏమిటంటే? తాజాగా ఈ రకానికి చెందిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ (Instagram)వేదికగా వైరల్ అవుతుంది.తీరా ఆ వీడియోని చూసిన జనాలు మాత్రం, మాకిదేం ఖర్మరా బాబూ! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాలిందే.
ఒక వివాహ వేడుకలో భాగంగా బంధువులు అందరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి, అబ్బాయి కల్సి డ్యాన్స్ షురూ(girl and boy start dancing together.) చేసారు.
వారితో పాటుగా పెళ్ళివారి తాలూక చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా తమదైన రీతిలో స్టెప్పులు వేస్తున్నారు.ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి ఆ అమ్మాయి అన్న ఎంట్రీ ఇస్తాడు.
ఆ తరువాత తన చెల్లి డాన్సు చూసి… బిగ్గరగా అరచి, డ్యాన్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సోదరికి సైగ చేస్తాడు.ఆ తర్వాత తన సోదరితో డ్యాన్స్ చేసిన అబ్బాయి దగ్గరికి వెళ్లి చెంప దెబ్బ కొడతాడు.
దాంతో ఆ అబ్బాయి కింద పడిపోతాడు.
అయితే, ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది.ఇదంతా నిజంగా జరిగిందని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే.ఇదంతా వ్యూస్ కోసం చేసిన వీడియో మాత్రమే అని ఆ తరువాత వారి వెకిలి నవ్వులు చూస్తే ఊరికే అర్ధం అవుతుంది.
అయితే అది చేసిన వారికి సరదాగా అనిపించినా.చూసిన వారికి రోత పుట్టించేలా ఉంది… అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.