చిన్నారుల్లో మైగ్రైన్‌.. నివార‌ణ‌కు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మైగ్రైన్ త‌ల‌నొప్పి.భ‌రించ‌లేని వ్యాధుల్లో ఇదీ ఒక‌టి.

సాధార‌ణ త‌ల‌నొప్పి అర గంట‌, గంట వ‌స్తేనే తెగ ఇబ్బంది ప‌డిపోతుంటారు.

కానీ, మైగ్రైన్‌ గంట‌ల‌తో మొద‌లై రోజుల వ‌ర‌కు ఉంటుంది.

ఇక మామూలు త‌ల నొప్పి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది.అదే మైగ్రైన్ ఏ మందుకు చిక్క‌దు.

పైగా మైగ్రైన్ వ‌చ్చిన‌ప్పుడు వాంతులు, వికారం, అల‌స‌ట‌, చూపు మ‌స‌క‌బారడం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.అలాగే వెలుగు, శ‌బ్ధం, వాస‌న‌ వంటివి అస్స‌లు ప‌డ‌వు.

Advertisement

అందుకే మైగ్రేన్ అంటే భ‌య‌ప‌డ‌తాయి.అయితే ఈ స‌మ‌స్య పెద్ద‌లకే వ‌స్తుంద‌ని చాలా మంది భావిస్తుంటారు.

కానీ, ఐదేళ్ల చిన్నారులు సైతం మైగ్రైన్ బారిన ప‌డ‌తారు.చిన్నారుల్లో మైగ్రైన్ రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

కొంద‌రు వంశపారపర్యంగా వ‌స్తే.మ‌రికొంద‌రు ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర స‌రిగ్గా లేక‌పోవ‌డం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, డీహైడ్రేష‌న్‌, అతి నిద్ర‌, ఒత్తిడి, ఎక్కువ‌గా ఏడ‌వ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌నాల వ‌ల్ల మైగ్రైన్‌కు గుర‌వుతాయి.

దాంతో వారు ఆ త‌ల‌నొప్పిని త‌ట్టుకోలేక ఓవైపు.చ‌దువుల్లో రాణించ‌లేక మ‌రోవైపు తీవ్రంగా న‌లిగిపోతుంటారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే మైగ్రైన్‌తో బాధ ప‌డే చిన్నాల విష‌యంలో వారి త‌ల్లిదండ్రులు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఏ విష‌యంలోనైనా పిల్లలను ఒత్తిడికి గుర‌వ్వ‌కుండా చూసుకోవాలి.

Advertisement

రెగ్యుల‌ర్‌గా తొమ్మిది లేదా ప‌ది గంట‌ల పాటు ప‌డుకునేలా చూసుకోవాలి.స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌, టీవీ వంటి గ‌డ్జెట్స్‌ను పిల్ల‌ల‌కు దూరంగా ఉంచాలి.

పైన చెప్పుకున్న‌ట్టు డీహైడ్రేష‌న్ కూడా మైగ్రైన్‌కు ఒక కార‌ణ‌మే.సో.పిల్ల‌ల‌కు వాట‌ర్‌తో పాటు కొబ్బ‌రి నీరు, పండ్ల ర‌సాలు వంటి త‌ర‌చూ ఇవ్వాలి.అలాగే మైగ్రైన్ నివార‌ణ‌లో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అందువ‌ల్ల‌, పిల్ల‌ల డైట్‌లో పౌష్ఠికాహారం ఉండేలా చూసుకోవాలి.జంక్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌, కూల్ డ్రింక్స్‌, టీ, కాఫీ వంటి వాటిని పిల్ల‌ల డైట్‌లో నుంచి క‌ట్ చేయండి.

మైగ్రైన్‌తో బాధ ప‌డే చిన్నాల తల, మెడపై రెగ్యుల‌ర్‌గా ఆయిల్‌తో మసాజ్ చేయండి.ఇక పిల్ల‌లు నొప్పి భ‌రించ‌లేక‌పోతున్నార‌ని.

వారికి పెయిన్ కిల్ల‌ర్స్ వేస్తారు.కానీ, పెయిన్ కిల్ల‌ర్స్‌ను పొర‌పాటున కూడా వాడ‌రాదు.

వైద్యులు సూచించే మందుల‌ను వాడాలి.

తాజా వార్తలు