రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ రేంజ్ ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది.ఇక ప్రభాస్ కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.
అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ప్రభాస్.ఆయన స్నేహితులకు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తుంటారు.
అయితే 15 ఏళ్ల కింద ప్రభాస్‌తో కలిసి చత్రపతి సినిమాలో నటించిన శేఖర్ గుర్తుకు ఉన్నారా.? ఆయన రాజమౌళి చిత్రీకరించిన సినిమాల్లో దాదాపు అన్నింట్లోనూ నటించారు.అంతేకాదు.విక్రమార్కుడు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు.ఇక చత్రపతిలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించి.ఇంటర్వెల్ అప్పుడు చనిపోయే పాత్రలో శేఖర్ నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి శేఖర్ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు.
ఇక ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని.
సైలెంట్‌గా తన పని తాను చేసుకునేవాడని శేఖర్ చెప్పుకొచ్చారు.అయితే ఓ రోజు షూటింగ్ కోసం సముద్రంలోకి వెళ్లామని.
ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం ఒడ్డు కనబడకూడదని.సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
ఇక అదే సమయంలో విలన్ గ్యాంగ్ నుంచి తమ సరుకు కాపాడుకోడానికి సముద్రంలో తమ సరుకును దాచేస్తామని.అప్పుడు తను నీళ్లలోకి మునిగి తీయాల్సిన సీన్ రాజమౌళి చిత్రీకరిస్తున్నాడని శేఖర్ చెప్పుకొచ్చారు.

అయితే ఆ సమయంలో తన కాళ్లు ప్రభాస్ పట్టుకుంటే.బయటికి వచ్చిన తర్వాత కాలర్ అజయ్ పట్టుకోవాలని.కానీ అనుకోకుండా అజయ్‌కు తన కాలర్ దొరక్కపోవడంతో ఎంత వేగంగా పైకి వచ్చానో.అంతే వేగంగా మళ్లీ సముద్రంలోకి పడిపోయానని తెలిపాడు.ఇక ఆ సమయంలో తన కాళ్లు అస్సలు వదలకుండా అలాగే ప్రభాస్ పట్టుకున్నాడని.చాలా సేపు వరకు అలాగే ఉన్నాడని.
లోపల తనకు ప్రభాస్ తన ప్రాణాల కోసం పడుతున్న శ్రమ అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు.కాగా ఆ రోజు తనకేమైనా అవుతుందేమో అని ప్రభాస్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదని శేఖర్ అన్నారు.
అయితే ఆ రోజు ప్రభాస్ లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే భయమేస్తుందని శేఖర్ చెప్పుకొచ్చారు.