దీపావళి పండుగ( Diwali ) రానే వచ్చింది.అందరూ ఎంతో ఇష్టంగా సరదాగా జరుపుకునే పండగల్లో దీపావళి ముందు వరుసలో ఉంటుంది.
ముఖ్యంగా ఈ రోజు కోసం పిల్లలు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు.దీపావళి సాయంత్రం టపాసులు కాల్చేందుకు తహతహలాడుతుంటారు.
ఇలాంటి ప్రత్యేకమైన రోజు ఫేస్ డల్ గా ఉంటే మగువుల బాధ వర్ణనాతీతం.కానీ వర్రీ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం ఇరవై నిమిషాల్లో ఇన్స్టెంట్ గ్లో పొందొచ్చు.పండగపూట అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అర కప్పు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్( Oats Powder ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి.చివరిగా మూడు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చేతి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.టాన్( Skin Tan ) మాయం అవుతుంది.నిమిషాల్లో మీ చర్మం వైట్ గా, బ్రైట్ గా మెరుస్తుంది.గ్లోయింగ్ స్కిన్( Glowing Skin ) మీ సొంతం అవుతుంది.
కాబట్టి దీపావళి రోజు ఫేస్ డల్ గా ఉందని బాధపడకుండా వెంటనే ఈ రెమెడీని ప్రయత్నించండి.అందంగా మెరిసిపోండి.
హ్యాపీగా పండగను సెలబ్రేట్ చేసుకోండి
.