రోజూ ఉదయం ''కాఫీ, టీ''ల బదులు ఒక గ్లాసు మజ్జిగ తాగితే...ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ,టీ త్రాగుతూ ఉండటం సహజమే.అదే ఉదయం లేవగానే కాఫీ,టీలకు బదులు మజ్జిగ త్రాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

 Health Benefits Of Buttermilk In Telugu-TeluguStop.com

మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.మజ్జిగలో ప్రోబయోటిక్ అనే మంచి బ్యాక్టీరియా ఉండుట వలన జీర్ణక్రియకు సహాయపడి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధ పడుతున్న వారు ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ మజ్జిగ త్రాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కడుపులో మంట తగ్గి కడుపులో చికాకు తగ్గుతుంది.

పొట్టలో అసౌకర్యంగా ఉన్న పదార్ధాలను బయటకు నెట్టేసి పొట్ట ప్రశాంతంగా,చల్లగా ఉండేలా చేస్తుంది.

భోజనం ఎక్కువ అయ్యి పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ అల్లం పొడి కలిపి త్రాగితే పొట్ట ఉబ్బరం నిమిషాల్లో తగ్గిపోతుంది.

డీహైడ్రేషన్ తో బాధపడేవారు ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు,మసాలా దినుసులు కలిపి త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

డయేరియా సమస్యతో బాధ పడేవారు మజ్జిగలో అల్లం పొడి కలిపి త్రాగితే ఉపశమనం కలుగుతుంది.

ఈ విధంగా రోజులో మూడు సార్లు త్రాగాలి.

మజ్జిగలో బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయటమే కాకుండా బ్లడ్ ప్రెజర్ ను కూడా తగ్గిస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube