టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తతకు దారి తీయడం తెలిసిందే.సొంత నియోజకవర్గంలో చంద్రబాబునీ పోలీసులు పర్యటనను అడ్డుకోవడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరగటంతో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.అయితే ఈ పరిణామం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.
“ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు – ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా?? మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన పింఛన్ ల గురించి ప్రశ్నలు వర్షం కురిపిస్తూ బహిరంగ లేఖ రాశారు.
పింఛన్ లు తొలగించి… మళ్లీ లబ్ధిదారులకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు.







