స్వచ్ఛమైన తేనె, కల్తీ తేనె మధ్య తేడా ఎలా కనిపెట్టాలి ?

తేనే.100 గ్రాముల తేనెలో 308 కాలరీలు, 82 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు, 52 మిల్లిగ్రాముల పొటాషియం, 2% ఐరన్ ఇంకెన్నో ఉంటాయి.మన చర్మానికి, రక్తానికి, మొత్తంగా శరీరానికి తేనె చేసే మేలు ఎంతో.కాని అది స్వచ్ఛమైన తేనె అయితేనే.స్వచ్ఛమైన తేనె అంటే ఏమిటి ? తేనెపట్టులోంచి అప్పుడే బయటకితీసింది.ఫ్యాక్టరీ నుంచి స్వచ్ఛమైన తేనె అనే పేరుతో వచ్చేది కాదు.

 How To Identify The Difference Between Organic Honey And Impure Honey Details, Pure Honey, Impure Honey, Honey Bees, Organic Honey, Pure Honey Tests, Honey Water Test, Fire, Cotton-TeluguStop.com

మార్కెట్లో అసలు తేనె అంటూ మనకు కల్తి తేెనె అమ్ముతుంటారు.నకిలీ తేనెలో గ్లూకోజ్, ఫ్లోర్, ఆర్టిఫిషియల్ షుగర్స్, డెక్స్ ట్రోస్, మొలాసెస్, కార్న్ సిరప్, స్టార్చ్ కలుపుతారు.

అందులో తేనె ఉంటుంది కాని ఇవన్ని కలపడంతో కల్తీ, నకిలీ అయిపోతుంది.మరి స్వచ్ఛమైన తేనె, కల్తి తేనె మధ్య తేడాలు ఎలా కనిపెట్టాలి?

 How To Identify The Difference Between Organic Honey And Impure Honey Details, Pure Honey, Impure Honey, Honey Bees, Organic Honey, Pure Honey Tests, Honey Water Test, Fire, Cotton-స్వచ్ఛమైన తేనె, కల్తీ తేనె మధ్య తేడా ఎలా కనిపెట్టాలి -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

* అసలైన తేనే రుచి తగ్గుతూ ఉంటుంది.అది సమయాన్ని బట్టి, వేడి చేయడం, చల్లార్చడం బట్టి మారిపోతుంది.కాని ఆర్టిఫీయల్ షుగర్స్ వలన నకిలీ తేనె రుచి మారదు.

* అసలైన తేనే వేళ్ళ మధ్య రాయండి.పెద్దగా బంకగా ఉండదు.

నకిలీ తేనే మాత్రం బంకగా ఉంటుంది.అయితే నకిలీ తేనె చేతిలో పడేయండి జారిపోతుంది.

కాని అసలు తేనె స్టడిగా ఉంటుంది.

* తేనేటీగలు పూలనుంచి నెక్టార్ తీసుకోవడం వలన అసలైన తేనె సువాసనలా అనిపించవచ్చు.

నకిలీ తేనెలో అలాంటి వాసన ఉండదు.

* అసలైన తేనెను ఉడికిస్తే బుడగలు రావు.

నకిలీ తేనెలో వస్తాయి.

Telugu Cotton, Honey Bees, Honey, Impure Honey, Organic Honey, Pure Honey-Telugu Health

* అసలు తేనే పూర్తి స్వచ్ఛంగా ఉండదు.దాంట్లో కొంత దుమ్ము ఉండవచ్చు, తేనేటీగల శరీరభాగాలు పడిపోయి ఉండవచ్చు.నకిలీ తేనె అలా ఉండదు.

* గ్లాసులో నీళ్లు తీసుకోని తేనే వేయండి.అసలు తేనె పెద్దగా వేరుపడకుండా గ్లాసు కిందికి చేరుకుంటుంది.మనం దాన్ని బాగా కలిపితే తప్ప, నీటిలో కలిసిపోదు.నకిలీ తేనే ఇలా వేయగానే అలా కరిగిపోతుంది.

* కాస్త దూది తీసుకోని ముందు నకిలీ తేనె రాసి అగ్గిపెట్టెతో వెలిగించండి. అది వెలగదు.స్వచ్ఛమైన తేనె అయితే వెలుగుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube