స‌మ్మ‌ర్‌లో వేధించే స‌న్‌ట్యాన్‌ను ఇంట్లోనే నివారించుకోండిలా!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.ఈ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రినీ స‌న్‌ట్యాన్ స‌మ‌స్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది.

 Best Remedies To Get Rid Of Sun Tan! Best Remedies, Sun Tan, Tan, Latest News, S-TeluguStop.com

ఎండ‌లో ఒక్క‌ పావు గంట ఉన్నా చాలు చ‌ర్మం ట్యాన్ అయిపోతూ ఉంటుంది.దాంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌టం కోసం ఏం చేయాలో తెలీక తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే ఇంట్లోనే స‌న్‌ట్యాన్‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

క‌ల‌బంద‌.అంద‌రి ఇళ్ల‌ల్లో ఉండే ఔష‌ధ మొక్క ఇది.ఆరోగ్యానికి, చ‌ర్మ సౌంద‌ర్యానికి, జుట్టు సంర‌క్ష‌ణ‌కు క‌ల‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా స‌న్‌ట్యాన్‌కు ఇది బెస్ట్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

ఒక క‌ల‌బంద ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, రెండు చుక్క‌లు మింట్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ జ్యూస్‌ను ఐస్ ట్రేలో నింపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.

స‌న్‌ట్యాన్‌కు గురైన‌ప్పుడు ఈ ఐస్‌క్యూబ్స్‌ను తీసుకుని చ‌ర్మంపై రుద్దాలి.ఇలా చేస్తే త్వ‌ర‌గా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.

అలాగే చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్ అలోవెర జెల్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం వేళ్ల‌తో స్మూత్‌గా చ‌ర్మాన్ని ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube