మొటిమలు( Pimples ).వీటి గురించి పరిచయాలు అక్కర్లేదు.
టీనేజ్ ప్రారంభం అయిందంటే చాలు మొటిమల సమస్య మొదలవుతుంది.ఈ మొటిమలు అందాన్ని పాడు చేయడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
పైగా కొందరిలో మొటిమలు రెండు మూడు రోజుల్లో పోయిన వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.చాలా మంది ఈ మచ్చలతో తెగ సతమతం అయిపోతూ ఉంటారు.
వీటిని ఎలా నివారించుకోవాలి అర్థం కాక మదన పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ టిప్స్ మీకు అద్భుతంగా సహాయ పడతాయి.ఈ టిప్స్ ను పాటిస్తే సహజంగానే మొటిమలు తాలూకు మచ్చలకు( Acne Scars ) బై బై చెప్పవచ్చు.
మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా మొటిమల తాలూకు మచ్చలను కరివేపాకుతో పోగొట్టుకోవచ్చు.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ ఎండిన కరివేపాకు పొడిలో పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజు వాటర్ వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా కడగాలి.రోజుకు ఒకసారి రెమెడీని పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
కుంకుమ పువ్వు( Saffron ). ఖరీదు ఎక్కువే అయినప్పటికీ సౌందర్య సాధనలో ఇది ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.పావు టేబుల్ కుంకుమపువ్వును తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిలో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖం మొత్తానికి అప్లై చేసుకోవాలి.20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మొటిమల తాలూకు మచ్చలు మాయం అవుతాయి.
![Telugu Acne, Acne Scars, Tips, Clear Skin, Latest, Simple Tips, Skin Care, Skin Telugu Acne, Acne Scars, Tips, Clear Skin, Latest, Simple Tips, Skin Care, Skin](https://telugustop.com/wp-content/uploads/2023/09/Betel-Leaf-Powder-for-Acne-Scars.jpg)
ఇక మరొక మ్యాజికల్ రెమెడీ ఉంది.వన్ టేబుల్ స్పూన్ ఎండిన తమలపాకు పొడిలో రెండు టేబుల్ స్పూన్లు బాదం నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఫైనల్ గా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి .ఈ రెమెడీ పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తగ్గుముఖం పడతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.