ఓట్స్.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు ఖచ్చితంగా వారి డైట్‌లో ఓట్స్‌ను చేర్చుకుంటారు.శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తగ్గించడం లోనూ, గుండె జబ్బుల నుంచి రక్షించడం లోనూ, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు చేయడం లోనూ ఓట్స్ అద్భుతంగా పని చేస్తాయి.
అంతే కాదండోయ్.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో.
ముఖ్యంగా మొటిమలను నివారించడంలో సైతం ఓట్స్ సహాయ పడతాయి.
మరి ముఖానికి ఓట్స్‌ను ఎలా ఉపయోగించాలి? అన్నది ఇప్పడు తెలుసు కుందాం.ముందుగా ఓట్స్‌ను పౌడర్ చేసి పెట్టుకోవాలి.ఇప్పడు ఒక బౌల్ తీసుకుని.అందులో ఓట్స్ పౌడర్, పెరుగు మరియు టమాటా రసం వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
మరియు మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి.అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పౌడర్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారినికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు చర్మం ప్రకాశ వంతంగా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పౌడర్, పసుపు మరియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.అలాగే ముఖంపై ఉన్న మృత కణాలు తొలగి.
చర్మం గ్లోగా మారుతుంది.కాబట్టి, ఈ సింపుల్ టిప్స్‌ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.