ఈ జ్యూస్ తాగితే పొట్ట కొవ్వు వేగంగా క‌రుగుతుంద‌ట‌..తెలుసా?

సాధార‌ణంగా కొంద‌రు పొట్ట కొవ్వును క‌రిగించుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డుతుంటారు. క‌ఠిన‌మైన డైట్లు, హెవీ వ‌ర్కౌట్లు, ఫాస్టింగ్లు ఇలా ఎన్నో చేస్తుంటారు.

 Banana Stem Juice Help To Lose Belly Fat Naturally! Banana Stem Juice, Belly Fat-TeluguStop.com

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను తీసుకుంటే చాలా వేగంగా బెల్లీ ఫ్యాట్‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్యమెందుకు పొట్ట కొవ్వును త‌గ్గించే ఈ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ప‌ల్లెటూర్ల‌లో విరి విరిగా క‌నిపించే చెట్ల‌లో అర‌టి చెట్టు ఒక‌టి.చాలా మంది త‌మ పెర‌ట్లో అర‌టి చెట్ల‌ను పెంచుకుంటుంటారు.అర‌టి చెట్టు నుంచి వ‌చ్చే అర‌టి పండ్లే కాదు అర‌టి పువ్వు, అర‌టి ఆకు, అర‌టి కాండం ఇలా అన్నీ మ‌న ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటాయి.ముఖ్యంగా అర‌టి కాండం బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్‌ను అందించ‌గ‌ల‌దు.

అర‌టి కాండంతో జ్యూస్ త‌యారు చేసుకుని త‌ర‌చూ తీసుకుంటే అనేక జ‌బ్బుల‌ను నివారించుకోవ‌చ్చు.

అందులోనూ పొట్ట కొవ్వుతో బాధ ప‌డే వారికి అర‌టి కాండం జ్యూస్ బెస్ట్ అప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.

అర‌టి కాండ‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.మ‌రియు ఎన్నో పోష‌క విలువ‌లు కూడా దాగి ఉంటాయి.

అందువ‌ల్ల‌, అర‌టి కాండం జ్యూస్ తాగితే అతి ఆక‌లి ప‌రార్ అవుతుంది.పొట్ట చుట్టూ పేరుకుపోయిన ప్యాట్ కూడా వేగంగా క‌రుగుతుంది.

అంతేకాదు, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ, మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంలోనూ, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, శరీరాన్ని డిటాక్స్ చేయ‌డంలోనూ, మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించ‌డంలోనూ ఇలా ఎన్నో విధాలుగా అర‌టి కాండం జ్యూస్ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక ఇన్ని తెలుసుకున్నాక ఈ జ్యూస్ ఎలా త‌యారు చేయాలి.? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

దాని కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌ని లేదు.

ముందు అర‌టి కాండం తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసి వాట‌ర్‌లో శుభ్రం చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో అర‌టి కాండం ముక్క‌లు, గుప్పెడు కొత్తిమీర‌, క‌రివేపాకు, అర స్పూన్ జీల‌క‌ర్ర‌, క‌ప్పు పాలు, చిటికెడు ఉప్పు వేసుకుని మెత్త‌గా బ్లెండ్ చేసుకోవాలి.

అనంత‌రం ఫిల్ట‌ర్ చేసుకుంటే అర‌టి కాండం జ్యూస్ సిద్ధ‌మైన‌ట్టే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube