బన్నీ , సుకుమార్( Bunny, Sukumar ) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ( Pushpa The Rise Movie ) ఏ రేంజ్ హిట్ గా నిలిచిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో జాలిరెడ్డి పాత్రలో డాలి ధనుంజయ్ నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.
ఈ నటుడు కన్నడ నటుడు కాగా తాజాగా డాక్టర్ ధన్వితతో( Dr.Dhanvita ) ధనుంజయ వివాహం జరిగిందనే సంగతి తెలిసిందే.మైసూరులో బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగగా 30,000 మంది ఈ పెళ్లికి హాజరయ్యారు.
కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాల్ వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారని మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి క్షమించండని డాలి ధనుంజయ చెప్పుకొచ్చారు.
మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో మిమ్మల్ని కలుస్తామని పెద్ద మనస్సుతో మమ్మల్ని ఆశీర్వదించండని డాలి ధనుంజయ పేర్కొన్నారు.డాలి ధనుంజయ మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

డాలి ధనుంజయ తెలుగులో మరిన్ని సినిమాలతో బిజీ కావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ( Kannada industry ) హీరోగా, విలన్ గా డాలి ధనుంజయకు మంచి గుర్తింపు ఉంది.ఈ నటుడు నటించిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతున్నాయి.ధనుంజయ్ సతీమణి ధన్యత ప్రముఖ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ధన్యత చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని సమాచారం.డాలి ధనుంజయ ప్రస్తుతం ఉత్తరకాండ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.డాలి ధనుంజయ పాటల రచయిత కూడా కాగా కన్నడలో పదికి పైగా పాటలు రాసి ప్రశంసలు అందుకున్నారు.డాలి ధనుంజయ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
నటుడు డాలి ధనుంజయ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.