డెంగ్యూ( Dengue ) అనేది మిమ్మల్ని సులభంగా బలహీనపరిచే ఒక వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు.ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
కాబట్టి డెంగ్యూ వ్యాధిని నయం చేయడంలో పోషక ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోగులు సరైన విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
బలాన్ని తిరిగి పొందడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. డెంగ్యూ ( Dengue ) నుంచి త్వరగా కోలుకోవడానికి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఎలాంటి పండ్లు మీకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయి రసం జీర్ణ క్రియ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడడానికి మంచి ఔషధంగా సూచించారు. బొప్పాయి ఆకుల రసం( Papaya Leaves Juice ) ప్లేట్ లేట్ కౌంట్ పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే అరటి పండ్లు( Bananas ) సులభంగా జీర్ణం అయ్యే పండ్ల వర్గంలోకి వస్తాయి.
డెంగ్యూ ప్రభావం నుంచి త్వరగా కోలుకోవడానికి రోగులు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు.అలాగే అరటి పండులో పొటాషియం, విటమిన్ b6, మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
ఇవి అనారోగ్యం నుంచి కొలుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే డెంగ్యూ తర్వాత డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
కాబట్టి కొబ్బరి నీళ్లలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే ఖనిజా లవణాలు ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే డెంగ్యూ జ్వరం తరచుగా ఎముకలలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.డ్రాగన్ ఫ్రూట్ ( Dragon Fruit )ఎముకల బలాన్ని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దానీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కారణంగా హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది.
అలాగే దానిమ్మ పండు( Pomegranate )లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.దానిమ్మ పండు డెంగ్యూ జ్వరం నుంచి కోలుకోవడానికి అవసరమైన ఆరోగ్యకరమైన ప్లేట్‌లెట్ కౌంట్ ను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీని వినియోగం శరీరంపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.ఇది అలసట మరియు బలహీనతలతో పోరాడుతుంది.
ఇది డెంగ్యూలో సాదరణ మరియు తీవ్రమైన జ్వరం( Fever ) నుంచి కోలుకున్న తర్వాత చాలా వారాల పాటు ఉంటుంది.