ఏ హీరో అయినా సరే మాస్ హీరో గా ఉంటేనే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది అని నమ్ముతారు.లవ్ స్టోరీస్ సినిమాలు విజయం సాధించిన కూడా మాస్ సినిమా కు ఉన్న ఆ ఎఫెక్ట్ కనిపించాడు.
ఒక హీరో ఏ సెంటర్ లో కన్నా బి మరియు సి సెంటర్ లలో హిట్ కొట్టినప్పుడే నిజమైన హీరో గా నిలబడతాడు.అలా ఒక మాస్ హీరో మాత్రమే ఎన్ని ఫ్లాప్ సినిమాలే పడిన తట్టుకొని నిలబడగలడు.
ఈ రహస్యాన్ని నాచురల్ స్టార్ నాని ( Nani )ఎప్పుడో కనిపెట్టేసాడు.అందుకే తనను తాను ఒక మాస్ హీరో లేదా కమర్షియల్ హీరో అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం నాని కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు.నాని తాజాగా నటించిన దసరా సినిమా( Dasara movie ) ఒక మాస్ జాతర గా కనిపిస్తుండటంతో తో పాటు సూపర్ సక్సెస్ టాక్ దక్కించుకుంది కాబట్టి ఇక నాని కి మాస్ హీరో అనే ట్యాగ్ పక్కగా దక్కినట్టే.
అయితే నాని కి దసరా లాంటి మాస్ మూవీ కావాలని ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు.మొదటి కొన్ని సినిమాలను పక్కన పెడితే జెండా పై కపిరాజు సినిమాతో( Jenda Pai Kapiraju movie ) మాస్ హీరో గా ఎలివేట్ అవ్వాలని ప్రయత్నించిన ఆ చిత్రం ఆశించిన విజయం సాధించక పోవడం తో నాని ఆశల పై నీళ్ళు జల్లినట్టు అయింది.ఇక వి లాంటి ప్రయోగాత్మక చిత్రం లో సైతం నటించిన అది కూడా విజయం సాధించడం లో విఫలం అవ్వడం తో నాని కి మరోసారి భంగాపాటు తప్పలేదు.ఇక ఇప్పుడు దసరా సినిమాలో ఒక రగ్గడ్ లుక్ లో కనిపించి తనకు కావాల్సిన ఇమేజ్ సంపాదించుకోవడం లో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.
తన చిత్రానికి ఎలాంటి మాస్ లుక్ లో అయిన ఇమిడిపోయే కీర్తి సురేష్( Keerthy Suresh ) అయితే బాగుంటుంది అని పట్టుబట్టి తెచ్చుకున్నాడు.
ఇలా నాని మొత్తానికి ఒక మంచి మాస్ హీరో అయ్యాడు.ఇక దసరా సినిమా కు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.సరిగ్గా మంచి టైం చూసి చిత్ర యూనిట్ విడుదల చేసింది.
వేసవి సెలవులు, శ్రీరామ నవమి సెలవు కావడం తో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది.కీర్తి సురేష్ కూడా చాలా రోజులుగా ఒక మంచి పాత్ర కోసం ఎదురు చూస్తుంది.
మహానటి తర్వాత ఆ రేంజ్ పాత్ర ఆమెకు దొరకలేదు.కేవలం పెద్ద హీరోల పక్కన డ్యాన్స్ చేసే రోల్స్ తప్ప ఈ మధ్య కాలంలో ఈ జాతీయ ఉత్తమ నటి నీ ఎవరు సరిగ్గా వినియోగించు కాలేదు.