యోగా( Yoga ).దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
యోగా వల్ల ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారు.రోజుకు కనీసం ఇరవై నిమిషాలు యోగా చేసిన కూడా ఎన్నో లాభాలు పొందొచ్చు.
నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మనసు ప్రశాంతంగా మారుతుంది.
మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి పెరుగుతాయి.
అలాగే యోగా చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.ఇలా చెప్పుకుంటూ పోతే యోగా వల్ల చాలా లాభాలే ఉన్నాయి.
అయితే యోగా చేసేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.ముఖ్యంగా యోగా తర్వాత కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొందరు యోగా చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదు.వెంటనే స్నానం చేస్తే యోగా వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమి లభించవు.
స్నానం చేసిన వెంటనే కూడా యోగా చేయరాదు.యోగాకు అరగంట ముందు లేదా అరగంట తర్వాత స్నానం చేయాలి.
యోగా చేసిన వెంటనే గడగడా లీటర్ నీటిని తాగేస్తుంటారు.యోగా చేసిన సమయంలో చాలా శక్తి ఖర్చవుతుంది.అయితే యోగా తర్వాత దాహం ఉన్నా సరే వెంటనే వాటర్ ను తీసుకోరాదు.కొంచెం గ్యాప్ తీసుకుని వాటర్ లేదా కొబ్బరి నీళ్లు( Coconut water ) వంటివి తీసుకోవాలి.
అలాగే యోగా తర్వాత చాలా ఆకలి వేస్తుంటుంది.కానీ, యోగా చేసిన వెంటనే పొరపాటున కూడా ఎలాంటి ఆహారం తీసుకోరాదు.
గంట తర్వాత ఏదైనా తినాలి.తిన్న వెంటనే కూడా యోగా చేయరాదు.
అలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్య( Digestive problems )లు తలెత్తుతాయి.ఫుడ్ తీసుకున్న రెండు గంటల తర్వాత యోగా చేస్తే మంచిది.
యోగా చేసిన వెంటనే వ్యాయామం చేయకూడదు.అలాగే వ్యాయామం చేసిన వెంటనే యోగా కూడా చేయకూడదు.
యోగాకు ముందు కొంత సమయం వార్మప్ చేయడం మర్చిపోకండి.లేకపోతే కండరాలు పట్టేస్తాయి.
ఇక నెలసరి సమయంలో మహిళలు యోగా చేయకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.