వాహనముతో నిమ్మకాయను ఎందుకు తొక్కిస్తారో అసలు నిజం తెలుసా..?

మన దేశంలోనీ ప్రజలు చాలా ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.కొన్నిసార్లు అలాంటి ఆచారాలను, పద్ధతులను మనం ఎందుకు పాటిస్తున్నాము కూడా మన దగ్గర సరైన సమాధానం ఉండదు.

 Know Why Lemons Are Crushed Under New Vehicles Pooja Details, Lemons , Lemons C-TeluguStop.com

ఏదో పూర్వం పెద్దవారు చెప్పారు మంచిదట చేస్తే పోయేదేముంది అని చేస్తూ ఉంటారు.కొత్తగా ఏదైనా వాహనం( New Vehicle ) కొన్నపుడు పూజ చేయించి దాన్ని నిమ్మకాయతో( Lemon ) తొక్కించి స్టార్ట్ చేస్తూ ఉంటారు.

ఇలా చేస్తే దిష్టి దోషం ఉండదని ఉండదు అని మనం అనుకుంటూ ఉంటాం.అసలు ఇలా ఎందుకు చేయాలి? నిమ్మకాయతో తొక్కించడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bullock, Citric Acid, Disti Dosham, Crushed, Vehicles, Vehicles Pooja, Va

ముఖ్యంగా చెప్పాలంటే పూర్వకాలంలో మనకు ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు( Bullock Carts ) ఎక్కువగా ఉండేవి.ఎడ్లు గుర్రాలు అనేక ప్రదేశాల్లో నడిచేవి దారిలో రాళ్లు రప్పలు, బురద ఇలా ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి.వాటన్నిటి మీద ఇవి నడుస్తాయి.అలా నడుస్తున్నప్పుడు వాటి కాళ్లలో ఏవైనా గుచ్చుకొని పుండ్లు( Injuries ) అవుతాయి.ఈ కాళ్ల మీద బురద పడితే ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు వస్తాయి.పురుగులు పడితే బండి సరిగ్గా నడవదు.

బండి బాగా నడవడం కోసం ఎడ్ల చేత, గుర్రాల చేత నిమ్మకాయలు తొక్కించేవారు.

Telugu Bullock, Citric Acid, Disti Dosham, Crushed, Vehicles, Vehicles Pooja, Va

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్( Citric Acid ) పుండ్లలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.పూర్వకాలం వాళ్ళు వెళ్తూ వెళ్తూ బండిని నిమ్మకాయపై ఎక్కించండి అని చెప్పేవారు.మనం కూడా ఆ పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం.

అయితే వాళ్ళు ఎడ్ల బండిని లేదా గుర్రపు బండిని ఉద్దేశించి చెప్పారు.కానీ మనం మాత్రం మామూలు వాహనాలకు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ వస్తున్నాం.

అంటే రబ్బర్ టైర్లను కూడా నిమ్మకాయ మీదకి ఎక్కిస్తున్నాం.ఈ విషయం తెలియక ఇన్ని రోజులు అందరూ ఇదే పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఈ విషయం చెప్పినా ఎవరు వినరు.ముందు కచ్చితంగా నిమ్మకాయతో తొక్కించాల్సిందే అప్పుడే దిష్టి దెబ్బ తగలదు అని వాదించే వారు కూడా ఉన్నారు.

ఈ సమాచారం కేవలం ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే.మళ్లీ దీనిపై వాదనలు ఎందుకు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube