క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళా పరిపాలించాడు.అయితే తన తండ్రి వేములవాడలో ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి భక్తుడు.
విషంయ తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళా… గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా సమర్పించాడు.అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.
బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ.మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు తెలంగాణ వాసులు.
పర్వతం త్రికోణాకృతిలో ఉండటంతో అలాగే తయారు చేసుకుంటూ వస్తున్నారు.

రంగురంగు పూలను తీసుకొచ్చి.జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ బతుకమ్మను పేరుస్తారు.ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు.
ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు.మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు.
ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది.తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు.
పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు.ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు.
సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ.పాటలు పాడతారు.
అందంగా ముస్తాబై ఆటపాటలు ఆడుకుంటూ తెగ మురిసిపోతుంటారు ఆడపడుచులు.ఇలా చాలా సేపు ఆడాక బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.
ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
DEVOTIONAL