ఎన్టీఆర్ కొరటాల శివ ( Koratala Shiva ) కాంబినేషన్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దేవర.( Devara ) ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఇక మొదటి భాగంలో ఎన్టీఆర్ ( NTR ) ద్విపాత్రాభినయంలో తండ్రి కొడుకుల పాత్రలో నటించారు.
ఇక ఈ భాగంలో తండ్రి పాత్రలో నటించిన దేవరని కొడుకు వర ఎందుకు చంపుతారనే ప్రశ్న అందరిలోనూ ఎన్నో అంచనాలను పెంచేస్తోంది.ఈ సినిమా క్లైమాక్స్ రాజమౌళి బాహుబలి సినిమా క్లైమాక్స్ ను మించి ఉందని చెప్పాలి.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే మనం పార్ట్ 2 వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.ఇక దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ సుమ ( Suma ) ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ అసలు దేవరను వర ఎందుకు చంపారు అంటూ ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ.
ఆ అడిగిన వెంటనే చెప్పుతారు మరి.ఇప్పుడు నేను చెబితే దేవర 2 కి ఎవరు టికెట్స్ కొంటారు.అన్ని తెలుసుకుందామనే.చిలిపి నువ్వు అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక దేవర 2 లో వర ఎందుకు తన తండ్రిని చంపారు అనే విషయంపైనే కథ కొనసాగుతుందని తెలుస్తోంది.ఇక దేవర సినిమా పార్ట్ 2 పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసాయి.అయితే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా అయిందని తెలుస్తోంది.వీలైనంతవరకు దేవర 2 త్వరలో పూర్తి చేయటానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.