ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ( lunar eclipse )మార్చి 25వ తేదీన ఏర్పడింది.అంటే హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది.
మన దేశంలో ఈ గ్రహణం కనిపించలేదు.కాబట్టి హోలీ( Holli ) పండుగపై అంతగా ప్రభావం పడలేదు.
అయితే జ్యోతిష్య శాస్త్రంలో( astrology ) చంద్రగ్రహణం శుభప్రదంగా పరిగణించబడదు.కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని ప్రతికూల ప్రభావాలను నివారించడానికి పలు చర్యలు తీసుకోవాల్సిందే.
అయితే చంద్రగ్రహణం సమయంలో మనుషులపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.మరి ముఖ్యంగా చెప్పాలంటే చంద్ర దోషం ఉన్నవారు చంద్రగ్రహణం సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వారు చంద్రగ్రహణం రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే చంద్ర దోషం తొలగిపోతుంది.ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రునికి తెల్లని వస్తువులు( white clothes ) చెందినవి.కాబట్టి చంద్రగ్రహణం రోజున తెల్లని వస్తువులను దానం చేయాలి.చంద్రగ్రహణం రోజున తెల్లని వస్తువులను దానం చేయడం వలన చంద్ర దోషం యొక్క ప్రభావం తగ్గిపోతుంది.అంతేకాకుండా చంద్రగ్రహణం తర్వాత పాలతో కూడిన స్వీట్ లను కూడా దానం చేయాలి.
ఎందుకంటే ఇవి కూడా తెల్లని రంగుతో ఉంటాయి.

కాబట్టి చంద్రగ్రహణం రోజున ఈ విధంగా చేస్తే మీరు చంద్రగ్రహణం యొక్క ప్రతికూల పరిమాణాలను నివారించవచ్చు.అంతేకాకుండా చంద్రగ్రహణం రోజున స్వీట్లను దానం చేయడం వలన లక్ష్మీదేవి ( Goddess Lakshmi )కూడా అనుగ్రహిస్తుంది.చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత పేదలకు అన్నదానం చేయాలి.
ఇలా చంద్రగ్రహణం తర్వాత అన్నదానం చేయడం వలన గ్రహణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.అంతేకాకుండా ఈ విధంగా చేయడం వలన సంపద, వ్యాపారాలు కూడా పెరిగిపోతాయి.
కాబట్టి చంద్రగ్రహణం సమయంలో పలు నియమాలు ఈ విధంగా పాటిస్తే చంద్రదోషం తొలగిపోతుంది.