కొన్ని ఘటనలను వ్యక్తుల జీవితాలను మార్చివేస్తాయి.ఓవర్ నైట్ బిక్షగాడు కోటీశ్వరు కాగలడు.
కోటీశ్వరుడు రోడ్డు మీద పడగలడు.అనామకుడు స్టార్‌గా ఎదగొచ్చు.
సూపర్ స్టార్ అగాథంలో పడిపోనూ గలడు.అలాంటి కోవకే చెందుతాడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.1990 ప్రారంభంలో మంచి హిట్లతో మోహన్‌బాబు హవా కొనసాగింది.మేజర్ చంద్రకాంత్ తర్వాత హిట్లకు దూరం అయ్యాడు.
ఈ మూవీ తర్వాత మోహన్‌బాబు అల్లరి పోలీస్, కుంతీ పుత్రుడు, డిటెక్టివ్ నారద సినిమాల్లో నటించారు.ఈ చిత్రాలన్నీ ఘోర పరాజయాన్ని చవి చూశాయి.
వరుస అపజయాలతో ఉన్న మోమన్ బాబు.ఒకరోజు తన ఆప్తమిత్రుడైన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిశాడు.తన పరిస్థితిని విరించాడు.అదే సమయంలో తమిళంలో దుమ్మురేపుతున్న నాట్టమై చిత్రాన్ని చూపించాడు.
ఆ సినిమా రీమేక్ రైట్స్ తనని తీసుకోమని చెప్పాడు.అంతేకాదు.
ఈ సినిమాలోని తండ్రి పాత్రను తాను చేస్తానని హామీ ఇచ్చాడు.అప్పటికే పుణ్యభూమి నాదేశం అనే సినిమాను రీమేక్ చేస్తున్నాడు.
మరో రీమేక్ సినిమా అనగానే కాస్త ఆలోచనలో పడ్డాడు.అయినా మోహన్‌బాబుకు ధైర్యం చెప్పాడు రజనీకాంత్.
ఈ సినిమాతో ఫ్లాప్‌లకు బ్రేక్ పడుతుందని చెప్పాడు.
రజనీకాంత్ సలహాతో నాట్టమై నిర్మాతతో మోహన్‌బాబు మీటయ్యాడు.
రజనీతో జరిగిన సంభాషణను వివరించి ఈ సినిమా రీమేక్ రైట్స్ కావాలని చెప్పాడు.అందుకు తను అంగీకరించాడు.
ఈ సినిమాకు తొలుత బి గోపాల్‌ను దర్శకుడిగా చేయాలన్నారు.రీమేక్ సినిమా కావడంతో తను అంగీకరించలేదు.
చివరకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.పెద రాయుడు పేరుతో ఈ సినిమా నిర్మాణం మొదలైంది.
మోహన్‌బాబు ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ కుదువపెట్టాడు.

అనుకున్నట్లుగానే ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగింది.ఈ మూవీలో మోహన్‌బాబు తండ్రి క్యారెక్టర్ చేసిన రజనీ కాంత్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ రీమేక్ చిత్రం.
హిట్లులేక అప్పుల్లో మునిగిన మోహన్ బాబుకు ఈ చిత్రం ఊహించని అద్భుత విజయాన్ని అందించింది.ఈ సినిమా ఆడినన్ని రోజులు సినిమా థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడాయి.
అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ అభించింది.పెద రాయుడు సినిమా డైలాగ్ కింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అంతేకాదు.అప్పటి వరకు చిరంజీవి ఘరాన మొగుడు సినిమా 10 కోట్ల రూపాయల వసూళ్ల పేరుమీద ఉన్న రికార్డును ఈ సినిమా 12 కోట్ల రూపాయలు సాధించి చరిత్ర సృష్టించింది.