సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతోంది.ఎండలు మెల్ల మెల్లగా ముదురుతున్నాయి.
ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు తప్పకుండా కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
అటువంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఒకటి.మరి ఆ జ్యూస్ ఏంటీ.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ సబ్జా గింజలు, కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఒక అరటి పండు తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్‌ను కూడా తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి.చివరిగా పొట్టు తీసిన అల్లం ముక్కను సన్నగా తురుముకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, అరటి పండు ముక్కలు, ఆరెంజ్ పండు స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, అర లీటర్ వాటర్ పోసి బ్లెండ్ చేసుకోవాలి.ఆ తర్వాత జ్యూస్‌ను గ్లాస్‌లోకి తీసుకుని.
అందులో మొదట నానబెట్టుకుని సబ్జా గింజలు, రెండు ఐస్ ముక్కలు కలిసి సేవించాలి.

ఈ జ్యూస్‌ను వారంలో మూడు సార్లు తీసుకుంటే వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.నీరసం, అలసట, తలనొప్పి, అధిక దాహం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి .అధిక ఆకలి తగ్గుతుంది.వెయిట్ లాస్ అవుతారు.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.మరియు శరీరం ఎల్లప్పుడూ యాక్టివ్‌గా కూడా ఉంటుంది.