తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు ఉన్నట్టుగానే కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు ఒకప్పుడు రాజబాబు, రేలంగి, పద్మనాభం లాంటి సీనియర్ కమెడియన్స్ కామెడీతో అందరినీ అలరించారు వాళ్ళ తర్వాత అలాంటి అల్లు రామలింగయ్య కూడా జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.వీళ్ళ తరం తర్వాత జనరేషన్ లో వచ్చిన బ్రహ్మానందం లాంటి కమెడియన్ జనాలఅందరిని తన కామెడీతో నవ్వించాడు అలాగే ఇండస్ట్రీలో కమెడియన్ కు సపరేట్ గుర్తింపు తీసుకొచ్చిన నటుడు కూడా బ్రహ్మానందం గారు అనే చెప్పాలి.
బ్రహ్మానందం తర్వాత ఎమ్మెస్ నారాయణ, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్ లాంటి వారు ఉన్నప్పటికీ వీరితో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా తనదైన కామెడీతో సినిమాల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ క్యారెక్టర్ లు చేస్తూ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ల్ ఉన్నట్టు ఉంటే ధర్మవరం గారిది సపరేటు స్టైల్ ఉండేది.
అయితే కొద్ది కాలం క్రితం ఆయన మరణించడంతో ఆయన లేని లోటు తీర్చేవారు ఇండస్ట్రీలో కరువయ్యారు.ముఖ్యంగా ఆయన ఆనందం, నువ్వే నువ్వే, నువ్వు నేను, రెడీ లాంటి సినిమాల్లో తన కామెడీతో జనాల్ని నవ్వుల్లో ముంచెత్తాడు.
ప్రస్తుతం ఆయన కొడుకు అయిన రవితేజ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈమధ్య రవితేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు…

వాళ్ల నాన్న స్టార్ కమెడియన్ గా ఉన్నప్పుడు వాళ్ల నాన్న దగ్గర పనిచేసిన వ్యక్తి బిహేవియర్ లో తేడా కనిపించింది అని చెప్పుకొచ్చాడు అసలు విషయం ఏంటంటే రవితేజకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి సినిమాలో చేద్దామంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో తేలియక వాళ్ల నాన్న దగ్గర పని చేసిన వ్యక్తికి ధర్మవరం గారు చేసిన హెల్ప్ గుర్తుకొచ్చి మనకు ఏదైనా సినిమాకి సంబంధించి హెల్ప్ చేస్తారేమోనని అడగడానికి వెళ్ళినప్పుడు అతన్ని అవమానించాడని చెప్పుకొచ్చాడు.నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను ఎవరికైనా రిఫర్ చేస్తారా అని రవితేజ అడగగా ఆయన నీ గురించి నీ యాక్టింగ్ గురించి ఏమీ తెలియనప్పుడు నేను ఎలా రిఫర్ చేయాలి అని అన్నాడంట.అప్పుడు రవితేజ కి మా నాన్న హెల్ప్ చేస్తే ఈరోజు వీడు ఈ పొజిషన్లో ఉన్నాడు అలాంటివాడు ఇప్పుడు ఇలా మాట్లాడడం అతనికి నచ్చలేదు.
అయితే అప్పుడే ఒక పెద్ద ఫ్యామిలీ కి చెందిన స్టార్ హీరో ఒక్క కార్ లో నుండి వచ్చి పక్కన షూటింగ్ జరుగుతూ ఉంటే నేల పైన కూర్చొని అక్కడికి ఒక కుక్క పిల్ల వస్తే దాంతో ఆడుకుంటున్నాడు అలాంటి ఆయన్ని చూసిన రవితేజకి ఈయనకి ఇంత లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ అనుభవించకుండా కింద కూర్చున్నాడు అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు.
అలా మనసులో అనుకొని పక్కనే ఉన్న వీళ్ళ నాన్న హెల్ప్ తీసుకున్న వ్యక్తితో ఆ కింద కూర్చున్న వాళ్ల గురించి మాట్లాడుతూ వాళ్ళు అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారేంటి అని అడిగితే అప్పుడు వాడు ఏమీ లేని మనలాంటి వాళ్లే ఎగిరెగిరి పడతారు అన్నీ ఉన్న వాళ్లు అలాగే అనిగిమనిగి ఉంటారు అని చెప్పాడు.
అయితే రవితేజకి వాడి మాటలకి కోపం వచ్చినప్పటికీ ఏం చేయలేక నేను ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యాక వాడి సంగతి చూసుకుంటా అని మనసులో అనుకొని అక్కడినుంచి బయటికి వచ్చేశాడు.కానీ ఒక మనిషి దగ్గర హెల్ప్ తీసుకుంటే మనిషి అనే ప్రతి ఒక్కరూ దానికి కృతజ్ఞతాభావం గా సహాయం చేయాలి అలా మనకి హెల్ప్ చేసిన మనిషి లేనప్పుడు ఏదో ఒకటి వాళ్ల ఫ్యామిలీకి చేయాలి.
అలాంటి కృతజ్ఞతాభావం లేని వాళ్ళకి మనం ఎంత చేసిన వేస్ట్ అనే చెప్పాలి.ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అయిన రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ నాన్న లాగా తను కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడో లేదో చూద్దాం….