టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన సినిమాలలో సర్దార్ గబ్బర్ సింగ్( Sardaar Gabbar Singh ) సినిమా కూడా ఒకటి.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కి రియల్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది.తన సెన్సేషనల్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ దాని తరహాలో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ఊహించని హైప్ వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో కూడా రిలీజ్ కి వచ్చిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ చిత్రాన్ని డాకు మహారాజ్ దర్శకుడు బాబీ తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా ఇపుడు మళ్ళీ ట్రెండింగ్ లో కనిపిస్తుండడం విశేషం.ఇకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ సర్వసాధారణంగా మారిపోయాయి.అలా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లోని సంగీత్ సీక్వెన్స్ పై కూడా ట్రోల్స్ లా స్టార్ట్ అయ్యాయి.
ఈ ట్రోలింగ్స్ ని పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ యాంగిల్ లో మార్చేసుకుని వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాకుండా వాటిని బాగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు.
అలా గత కొంతకాలంగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ట్రోల్స్, ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

అలా ఈ సినిమా మానియా తోనే సోషల్ మీడియా నిండిపోయింది అని చెప్పాలి.ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా( AP Deputy CM ) బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన విషయం తెలిసిందే.
హరిహర వీరమల్లు, భగత్ సింగ్ లాంటి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.ఈ సినిమాలు ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదు.ఇటీవల పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలలో పాల్గొన్న బోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.కానీ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల పైన పూర్తి శ్రద్ద వహించారు.
మరి ఈ సినిమాలకు ముహూర్తం ఎప్పుడు ఖరారు చేస్తారో చూడాలి మరి.







