నితిన్,( Nithin ) శ్రీలీల ( Sreeleela ) కాంబినేషన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్( Robinhood Movie ) సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నితిన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన సినిమా కావడం ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పబ్లిసిటీ మెటీరియల్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అయితే అదిదా సర్ప్రైజ్ సాంగ్ హుక్ స్టెప్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఈ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.
శేఖర్ మాస్టర్( Shekar Master ) ఈ సాంగ్ ను యూత్ కు నచ్చేలా కంపోజ్ చేశారు.ఒక స్టెప్ బాలేదని ట్రోల్స్ వస్తున్నా యూట్యూబ్ లో వ్యూస్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇప్పటికే ఈ సాంగ్ కు ఏకంగా 4 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఈ వ్యూస్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.రాబిన్ హుడ్ ట్రైలర్ విడుదలైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.దాదాపుగా 70 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా మైత్రీ నిర్మాతలకు ఈ సినిమా ఎంతమేర లాభాలను అందిస్తుందో చూడాలి.
రాబిన్ హుడ్ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ రూపంలో గట్టి పోటీ ఉంది.

నితిన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.పుష్ప2 సినిమా సక్సెస్ తో జోరుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ కు రాబిన్ హుడ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.నితిన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







