గరుడ పురాణంలో( Garuda Puranam ) మరణాంతర జీవితం పై వెలుగునిచ్చే మృత్యువుకు అధిపతి అయిన యమరాజు( Yamaraju ) నివాసంలోకి ప్రవేశించడం గురించి చెప్పడం జరిగింది.నిజానికి గరుడ పురాణం హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి.
ఇది జీవిత జనన మరణ చక్రం, నరకం, స్వర్గం, మానవ కర్మల ఫలితాల గురించి వివరంగా వివరిస్తుంది.అయితే ఈ రోజు మనం గరుడ పురాణం ప్రకారం యమలోకంలో( Yamlok ) ప్రవేశించే ఆత్మలు ఏ ద్వారం నుండి వారి కర్మలను బట్టి ప్రవేశిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యమలోకంలోకి ఆత్మలు ప్రవేశించడానికి నాలుగు ప్రవేశాలు ఉన్నాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది.తన జీవితకాలంలో చేసే చర్యల ఆధారంగా ఒక వ్యక్తి శిక్షించబడతాడు.
ఈ నాలుగు ద్వారాలు ఆత్మ యొక్క విధులను బట్టి విభజించబడతాయి.
తూర్పు ద్వారం నుండి నిష్ణాతులైన యోగులు, గొప్ప తపస్వులు, ఋషులు, సాధువుల కోసం తయారు చేయబడినది.
పుణ్యాత్ములు మాత్రమే ఈ ద్వారం లోకి ప్రవేశం పొందుతారు.ఇక ఈ ఆత్మలు యమలోకానికి చేరుకున్నప్పుడు తూర్పు ద్వారం తెరుచుకుంటుంది.ఇక గరుడ పురాణంలో ఈ తలుపు అనేక రకాల రత్నాలు, ముత్యాలతో నిండి ఉంటుంది.పుణ్య కర్మాలు( Good Deeds ) చేసే ఆత్మలను స్వాగతించడానికి గంధర్వులు, అప్సరసలు, దేవతలు ఈ ద్వారం వద్ద నిలబడి ఉంటారు.

ఇక పుణ్యాత్ములు ఈ ద్వారం గుండా ప్రవేశించినప్పుడు వారిపై పుష్పాలు కురిపిస్తారు.ఇక చిత్రగుప్తుడు( Chitragupta ) వారిని గౌరవించి స్వర్గానికి మార్గాన్ని అందిస్తాడు.ఇక పశ్చిమ ద్వారం దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసే ఆత్మల ప్రవేశం కోసం ఉంటుంది.తమ జీవితంలో ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించి నిస్వార్ధంగా అందరికీ సేవ చేసిన, తీర్థయాత్ర లేదా ఏదైనా తీర్థయాత్రకు ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తుల ఆత్మలు ఈ ద్వారం గుండానే యమలోకంలోకి ప్రవేశిస్తాయి.

ఇక ఉత్తర ద్వారం లో సత్యవంతుల ఆత్మలు వారి తల్లిదండ్రులకు ( Parents ) సేవ చేసిన వారు, ప్రజలకు సహాయం చేసిన వారు, ఉత్తర ద్వారం ద్వారా యమలోకంకి ప్రవేశిస్తారు.ఇక దక్షిణా ద్వారం చాలా బాధాకరమైన ద్వారం.ఈ తలుపు ఇతర తలుపుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.జీవితాంతం మాంసాహారం, మద్యం సేవించడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం, దైవాన్ని నమ్మకపోవడం, భార్యాభర్తలకు ద్రోహం చేయడం, ఇతర పాప కార్యాలు చేయడం లాంటి పాపాలు చేసిన ఆత్మలు ఈద్వారం ద్వారా ప్రవేశిస్తారు.
ఈ ద్వారం చేరుకోక ముందే ఆత్మ అనేక రకాల పీడలను అనుభవించి యమలోకంలోకి ప్రవేశిస్తుంది.