చందనోత్సవం( Chandanotsavam ) సందర్భంగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని సింహాద్రి అప్పన్న( Simhadri Appanna ) దేవస్థాన అధికారుల పై విమర్శలు వస్తున్నాయి.ఈ ఆరోపణల పై వివరణ ఇస్తున్న ప్రభుత్వానికి మరో వివాదం చుట్టుముట్టింది.
సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శన వీడియో సోషల్ మీడియాలో కనిపించడం పై ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి.స్వయంభూ మూర్తులు, మూలవిరాట్ ను ఫోటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ నిషేధం.
అలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటారు.అయితే మొన్న జరిగిన చందన ఉత్సవంలో భాగంగా దర్శనానికి వచ్చిన వ్యక్తుల్లో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
గత సంవత్సరం కూడా ఇలానే కొందరు వ్యక్తులు స్వామి వారి నిజరూపాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఆ ఘటన పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.ఇప్పుడు కూడా తాజాగా అలాంటి ఘటనే మళ్లీ జరిగింది.అయితే వరుసగా రెండు సంవత్సరాలు ఇలా జరగడం పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోను రాష్ట్ర మంత్రి గన్ మ్యాన్ ఒకరు తీశారని ప్రచారంలో ఉంది.

వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన దేవదాయ శాఖ అధికారులు ఆయన స్మార్ట్ ఫోన్ లాక్కున్నట్లు సమాచారం.అయినా కూడా వీడియో బయటకు రావడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గత సంవత్సరం జరిగినప్పుడే సీరియస్ గా అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని సింహాద్రి అప్పన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని స్వామివారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.