ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.57
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: మ.12.30 s4.30
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ప్రారంభించిన పనులు సక్రమంగా సాగుతాయి.దీనివల్ల ఏర్పడిన ఫలితాలు ఉంటాయి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మిథునం:

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.దీనివల్ల కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.మీరు పని చేసే చోట మంచి విజయం అందుకుంటారు.
సింహం:

ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.
ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది బయట సమయాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
తులా:

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
వృశ్చికం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పెట్ట పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్లు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు అందుకుంటారు.
మకరం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచారు ఏర్పడతాయి.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కుంభం:

ఈరోజు వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పని చేసే చోట పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.