టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి మనకు తెలిసిందే.సితార ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ కలిగి ఉండడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
ఇక ఈమె తరచూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు డాన్స్ వీడియోలు, పెయింటింగ్స్, సింగింగ్ ఇలా తనలో ఉన్నటువంటి టాలెంట్ అంతా సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటారు.ఇక సోషల్ మీడియాలో ఈమె వెకేషన్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో సీతారకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమార్తె భారతి గురించి చాలామందికి తెలియదు అయితే ఈమె కృష్ణ చనిపోయిన తర్వాత ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అప్పటినుంచి ఈమె సితారతో కలిసి పలు డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఓ పాటకు స్టెప్పులు వేశారు.
ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతోమంది అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోలో భాగంగా సితార భారతి ఇద్దరు కూడా హాలీవుడ్ మ్యూజిక్ కు స్టెప్పులు వేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఈ సినిమా కొంతకాలం పాటు వాయిదా పడింది.
అయితే సంక్రాంతి పండుగ పూర్తి అయిన అనంతరం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.