పాశ్చాత్య దేశాల్లో మహిళలు మద్యం మరియు స్మోకింగ్‌కు ఎక్కువగా బానిస అయిన విషయం తెల్సిందే.ఇండియాతో పోల్చితే ఇతర దేశాల్లో ఈ వ్యసనాలకు బానిస అయ్యే వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
టీనేజ్‌లో ఉన్నప్పుడు అలవాటు చేసుకున్న మద్యం స్మోకింగ్‌ను కాస్త పెద్దయిన తర్వాత లేదా పెళ్లి అయిన తర్వాత మానేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఒక మహిళ తన స్మోకింగ్ అలవాటును మానేసేందుకు ప్రయత్నించే క్రమంలో తన కొడుకును పోగొట్టుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మెల్‌బోర్న్‌కు చెందిన పాతికేళ్ల మహిళకు పదేళ్లుగా స్మోకింగ్ అలవాటు ఉంది.ఆ అలవాటు కారణంగా తన కొడుకుకు ఇబ్బంది ఉందని ఆమె గమనించింది.19 నెలల తన కొడుకు కోసం స్మోకింగ్‌ను పక్కకు పెట్టేయాలనే నిర్ణయానికి వచ్చింది.అందుకోసం ఈ సిగరెట్‌ను అలవాటు చేసుకుంది.
ఈ సిగరెట్‌ను తాగుతూ మెల్ల మెల్లగా స్మోకింగ్‌కు దూరం అయ్యింది.ఈ సమయంలోనే ఆమె కొడుకు ఈ సిగరెట్ లిక్విడ్‌ను తాగడంతో మృతి చెందాడు.

ఈ సిగరెట్‌లో వాడేందుకు లిక్విడ్ నికోటిన్‌ను ఆమె తీసుకు వచ్చింది.ప్రతి రోజు లిక్విడ్ నికోటిన్‌ను ఆమె తాగుతూ ఉంది.అయితే ఇటీవల ఆ లిక్విడ్ నికోటిన్ బాటిల్‌ను ఆడుతూ ఆ పిల్లాడు నోట్లో పెట్టుకున్నాడు.దాంతో ఆ పిల్లాడి కొద్ది సేపటికి అనారోగ్యం పాలయ్యాడు.అది గమనించిన ఆమె వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.ఆ పిల్లాడికి నికోటిన్ ఎక్కువ అవ్వడంతో లంగ్స్ పని చేయక పోవడంతో వెంటనే మృతి చెందాడు.
ఆమె ఆమె కన్నీరు మున్నీరు అయ్యింది.






