రాముల వారి కళ్యాణం ఎందుకు అంత ప్రత్యేకమైనది.. దాని వెనుక ఉన్న కథ ఏమిటి?

మన దేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి( Srirama Navami ) కూడా ఒకటి.శ్రీరామ నవమి రోజు రామాలయంలో అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం జరుపుతారు.

 Story Behind Sri Seetharamula Vaari Kalyanam Details, Sri Seetharamula Vaari Kal-TeluguStop.com

హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుద్ధ నవమి రోజున శ్రీరాముల వారీ కల్యాణం జరుపుతారు.అంగ రంగ వైభవంగా ఈ కళ్యాణాన్ని ప్రజలందరూ జరుపుతారు.

తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం రామయ్య దేవాలయంలో, కడపలోని ఒంటిమిట్ట దేవాలయంలో ముఖ్యంగా ఉత్సవాలను జరుపుతారు.ఈ నేపథ్యంలో ఈ సారి 30వ తేదీన రాములవారి కళ్యాణోత్సవం జరగనుంది.

అంతే కాకుండా దేవాలయాల సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అయితే ఎందుకు సీతారాముల వారి కల్యాణాన్ని( Sitaramula Kalyanam ) ఇంత ఘనంగా జరుపుతారు.

దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం శాలివాహన శకం 5114, జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు.శ్రీరాముడికి సీతమ్మకు శ్రీరామ నవమి రోజే వివాహం జరిగిందని పురాణాలలో ఉంది.శాస్త్రాలలో చెప్పిన దాని ప్రకారం ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే ఈ లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని, రాముడు సీత ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదని వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే యజ్ఞ ఫలితం ఆధారంగా వీరిద్దరూ జన్మించారు.పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు( Dasaratha Maharaju ) యాగం చేస్తారు.అప్పుడు శ్రీరాముడు జన్మించారు.యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా సీతమ్మ వచ్చారు.రామా అనే నామాన్ని ఉచ్చరించడం ఎంతో మేలు కలుగుతుంది.మన నోటి లోపల ఉండే పాపాలు అన్నీ పోతాయి.

ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకొని పోతుందని వేద పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube