హోలీ ఒక అందమైన రంగుల పండుగ.ఈ రోజున ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి రంగులు పూసి ఆనందంగా పండుగను జరుపుకుంటారు.
అయితే ఈ పండుగను జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.హోలీ పండుగ రోజు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రంగుల పండుగ రోజున ఒకరికొకరు రంగులు పోసుకుంటూ ఉంటారు.
ఈ విషయం దాదాపు చాలామందికి తెలుసు.
అయితే మీరు ఈసారి ఎవరికైనా రంగు పూసే సమయంలో వారి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.ఇష్టం లేకుండా ఎవరికి రంగు పూయకుడదు.
వారికి ఇష్టమైతేనే పూయలి.హోలీ జరుపుకోవడానికి ముందు గా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
ఇలా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఒంటికి అంటిన రంగులు చర్మ ఆరోగ్య ని దెబ్బతీయకుండా ఉంటాయి.

ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కూడా రంగుల సులభంగా తొలగిపోతాయి.ఇంకా చెప్పాలంటే హోలీ రంగులు పూసుకోవడానికి ముందు చర్మానికి, జుట్టుకి ఆయిల్ రాసుకోవడం మంచిది.దీని వల్ల చర్మంతో పాటు జుట్టు కూడా పాడవకుండా ఉంటుంది.
ఎవరికి బలవంతంగా రంగులను పూయకూడదు.మీకు రంగులను పూయడం సరదా కావచ్చు.
కానీ ఇతరులను బలవంత పెట్టడం మంచిది కాదు.ఇక హోలీ పండుగ అనగానే అందరూ ఫుల్ గా మందు తాగేస్తారు.

ఆ మత్తులో మరింత రెచ్చిపోతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పవిత్రమైన పండుగ సమయంలో మద్యపానం అసలు చేయకూడదు.ఇంకా చెప్పాలంటే శరీరానికి హానికరమైన రంగులను అస్సలు ఉపయోగించకూడదు.హోలీ రంగులను తొలగించడానికి చాలామంది కిరోసిన్ ఉపయోగిస్తూ ఉంటారు.అది చాలా ప్రమాదకరం.కాబట్టి రంగులను తొలగించడానికి కిరోసిన్ కాకుండా నూనె, క్లెన్సింగ్, వాటర్ లాంటివి ఉపయోగించాలి.