మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి భాజలు మోగబోతున్నాయని తెలుస్తోంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి (Lavanya thripaathi) ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే వీరి పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీ నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వీరిద్దరే నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ (Mega Family) అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీలందరికీ కూడా నిశ్చితార్థపు(Engagement) ఆహ్వానం అందిందని తెలుస్తోంది.లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరగడానికి మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాటికి ఒక కండిషన్ (Condition) పెట్టారని ఆ కండిషన్ కి ఒప్పుకున్నట్లయితేనే పెళ్లి జరుగుతుందని చెప్పారట.
ఇలా మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్ కు లావణ్య త్రిపాఠి ఒప్పుకున్న తర్వాతే వీరి వివాహం జరుగుతుందని తెలుస్తుంది.మరి లావణ్య త్రిపాటికి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించకూడదు అనే కండిషన్ పెట్టారట.ఇలా పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం కావాలని చెప్పడంతో లావణ్య త్రిపాఠి తనకు వరుణ్ కన్నా మరేది ఇంపార్టెంట్ కాదని భావించి మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్ కి ఒప్పుకొని ఈ పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
మరి లావణ్యకు మెగా ఫ్యామిలీ కండిషన్ పెట్టారన్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.