ఒకప్పుడు స్త్రీలైనా, పురుషులైనా రోజంతా పని చేసేవారు.సాయంత్రం 8 గంటల కల్లా పడుకునే వారు.
కానీ ఇప్పుడు రాత్రుళ్లు ఒంటి గంటైనా ఇంకా మేల్కొనే ఉంటున్నారు.ఫోన్, ల్యాప్ టాప్ లతో గడుపుతూ నిద్ర సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారు.
ఈ చెత్త అలవాటు కారణంగా ఎంతో మంది నిద్రలేమి( Insomnia ) బారిన పడుతున్నారు.నిద్రలేమి అనేది చిన్న సమస్యగానే కనిపించిన అత్యంత ప్రమాదకరమైనది.
నిద్రలేమి క్రమంగా కొనసాగితే ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయి.

అందుకే నిద్రపోవడం కోసం స్లీపింగ్ పిల్స్( Sleeping Pills ) వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే నైట్ నిద్ర తన్నుకొస్తుంది.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
ఇంతకీ ఏం చేయాలంటే రోజు పడుకోవడానికి అరగంట ముందు రెండంటే రెండు ఖర్జూరాలను నమిలి తినండి.ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి, హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి సేవించండి.
ఇలా రోజు నైట్ రెండు ఖర్జూరాలు, గ్లాసు పాలు( Dates with Milk ) కనుక తాగితే శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్ అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది.దీంతో సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోతారు.
నిద్రలేమి సమస్య పరారవుతుంది.అలాగే రోజు నైట్ రెండు ఖర్జూరాలు, ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
స్త్రీ, పురుషుల్లో లైంగిక సమస్యలు ఉంటే దూరం అవుతాయి.సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

ఖర్జూరం లో ఉండే విటమిన్ సి( Vitamin C ) మరియు శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను సైతం బలపరుస్తాయి.కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే నైట్ నిద్రించే ముందు రెండు ఖర్జూరాలు ఒక గ్లాసు పాలు తీసుకోవచ్చు.పిల్లలకు నైట్ నిద్రించే ముందు రెండు ఖర్జూరాలు, పాలు ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల మెరుగ్గా సాగుతుంది.ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.