ప్రస్తుత ప్రపంచంలో పోటీ, అసూయ ఎక్కువగా ఉంది.అటువంటి పరిస్థితులలో మనం ఎంతో శ్రమించి చిత్తశుద్ధితో పనిచేసిన మనకు లభించాల్సిన ఫలితాలు తారుమారు అవుతూనే ఉన్నాయి.
అగ్రస్థానంలో ఉన్న వారి విచిత్ర వైఖరి ఒక వైపు ఉండగా మనతో ఉన్న వారి కుతంత్రాలు కూడా మన పురోగతిని అడ్డుకుంటున్నాయి.ఇలా బాధపడే వారికి మేలు జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీతంతో ( Salary ) ఉన్నత స్థానం పొందడానికి ఈ పరిహారం చెయ్యాలి.ఈ పరిహారం కోసం మనం కొనుగోలు చేయవలసిన రెండు వస్తువులు గోమాతి చక్రం, లింగం.

మీరు ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాలు పని చేశారో అన్ని గోమాతి చక్రాలను( Gomathi Chakra ) మాత్రమే కొనాలి.ఈ పరిహారం చేయడానికి మీరు ఏ రోజునైనా ఎంచుకోవచ్చు.ఈ పరిహారాన్ని ఆచరించే రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత పూజాగదిలో దీపం వెలిగించి ఇత్తడి తాంబాల పళ్ళెం తీసుకోవాలి.మీరు కొనుగోలు చేసిన గోమాతి చక్రాన్ని అందులో ఉంచి దానిపైన ఈ పాదరసం లింగాన్ని ఉంచాలి.
ఇప్పుడు మీరు గోమాతి చక్రం పైన ఉన్న పాదరసలింగానికి అభిషేకం ( Abhisekam ) చేయాలి.అలాగే పాలు, పెరుగు, పన్నీర్, విభూది, కుంకుమతో అభిషేకం చేయాలి.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎన్ని ఎక్కువ వస్తువులతో అభిషేకం చేస్తే ఎంత త్వరగా ఫలితాలు పొందుతారు.ఈ అభిషేకం చేస్తున్నప్పుడు మీ ఉద్యోగ సంబంధిత సమస్యల కోసం మనస్పూర్తిగా భగవంతున్ని ప్రార్థించాలి.ఇంకా చెప్పాలంటే మీకు న్యాయమైన పదోన్నతి, జీతం పెరగాలని ప్రార్థించాలి.ఆ తర్వాత అన్ని అభిషేకాలకు ప్రత్యేక పాత్రలో పోసి మొక్క దగ్గర లేదా సురక్షితమైన స్థలంలో పోయాలి.
అభిషేకం తర్వాత ఈ గోమతి చక్రాన్ని పాదరసలింగాన్ని పూజ గదిలో ఉంచాలి.ఇలా అభిషేకం చేస్తూనే ఉంటే మీ చుట్టూ ఉన్న నెగెటివిటీ, మీలో ఉన్న నెగెటివిటీ దూరమై మంచి అవకాశాలు వస్తాయి.