రాతినే కొండగా మలిచిన దైవ సన్నిధి కైలాస దేవాలయం.మహారాష్ట్ర ఔరంగాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ దేవాలయం ఉంది.
దీని నిర్మాణానికి రాళ్లు, సిమెంట్ ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండ ను దేవాలయంగా మలచడం దీని ప్రత్యేకత.అయితే పై నుంచి కిందకి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం అనే అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఎందుకు నిర్మించారనేదానిపై విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో దాదాపు 100 అడుగుల ఎత్తైన కొండను దేవాలయంగా చెక్కారు.
పురావస్తు పరిశోధకుల అంచనా ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని 18 సంవత్సరాల పాటు చెక్కి ఈ దేవాలయాన్ని నిర్మించాలని వారు కనుగొన్నారు.శాసనాల ప్రకారం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 783 లో పూర్తి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.
ఈ దేవాలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగాజేబు తన సైన్యాన్ని పంపాడని వారంతా మూడు సంవత్సరాలు కష్టపడిన కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతూ ఉంటారు.
ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి.దేవాలయ గోడల పై రామాయణం మహాభారత గాధలను శిల్పాలుగా మలిచారు.దేవాలయ ఆవరణంలో స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి.
ఈ కైలాస దేవాలయం గురించి ప్రజల్లో ఉన్న కథ ఏమిటంటే స్థానిక రాజు తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో భార్య ఆ శివుడిని ప్రార్థించింది.మహారాజు కోలుకుంటే దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంది.
దీంతో ఆ రాజు కోలుకున్నాక మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమైంది.శిల్పులు కొండను తొలచి దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు.
రాజమాత ఉపవాసం గురించి తెలుసుకున్న ఒక శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె దేవాలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని అందుకే కింది నుంచి కాకుండా గోపురం నుంచి చెక్కమని సలహా ఇచ్చాడట.అందుకే కొండ పై నుంచి చెక్కుకుంటూ నిర్మాణం పూర్తి చేశారని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు.
DEVOTIONAL