ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో అట్టుడికిపోతోంది.ఆప్ఘన్ దేశం లో తాలిబాన్లు సృష్టిస్తున్న విధ్వంసానికి… అక్కడి దేశ పౌరులు.
వివిధ మార్గాల గుండా పారిపోతున్నారు.అదే రీతిలో ఎక్కడికక్కడ రోడ్లపై సామాన్య ప్రజలపై తాలిబాన్లు తుపాకులతో రెచ్చిపోతున్నారు.
ఇటువంటి తరుణంలో కొంతమంది భారతీయులు కాబుల్ ఎయిర్పోర్ట్ లో… స్వదేశానికి వచ్చేయాలని రెడీ అయిన క్రమంలో వాళ్లను తాలిబాన్లు కిడ్నాప్ చేసినట్లు అంతర్జాతీయస్థాయిలో వార్తలు రావడం జరిగింది.

దాదాపు 150 మంది భారతీయ పౌరులను ఆఫ్ఘనిస్తాన్…లో తాలిబాన్లు కిడ్నాప్ చేసినట్లు భారత్ మీడియాలో కూడా వార్తలు కలకలం రేపాయి.ఈ విషయాన్ని భారతీయ విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా కిడ్నాప్ చేసిన భారతీయ తాలిబాన్లు విడిచిపెట్టినట్లు అక్కడ ఉన్న విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది.
తాలిబన్ల చెర నుండి విడుదల పొందిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ప్రత్యేక విమానలు ఏర్పాటు చేయడం జరిగింది.