ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆవును చూస్తే.. నక్కతోక తొక్కినట్టే!

మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదంటారు.అందులోనూ నల్ల పిల్ల అయితే అపశకునం అంటారు.

 Seeing A Cow When Going Anywhere Is Going To Be Very Good, Cow Devotional , Luc-TeluguStop.com

తుమ్మినా, కట్టెలు ఎదురుగా వచ్చినా కాసేపు ఆగి ప్రయాణాన్ని కొనసాగిస్తారు.మరి ఆవును చూస్తే ఏం జరుగుతుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా.! ఆవును చూస్తే చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.గరుడ పురాణం ప్రకారం… ఒక రోజులో గోవు, గోమూత్రం, పంట పొలం, గోధూళి కనిపించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

ఆవు

హిందూ మత విశ్వాసాలలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.రోజులో ఏ సమయంలో గోమాత కనిపించినా దాన్ని శుభప్రదంగా భావిస్తారు.అలా కనిపించినప్పుడు మనసులో నమస్కరించుకుంటే శుభం కలుగుతుంది.గోమాత దర్శనం ద్వారా మీకు ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుంది.

గోమూత్రం

హిందూ మతంలో గోమూత్రాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.పూజా క్రతువులు, ఇతర శుభకార్యాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

కాబట్టి గోమూత్రాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు.గోమూత్రం సేవించడం కూడా మంచిదని భావిస్తారు.

ఆయుర్వేదంలో అనేక రకాల మందుల తయారీలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు.

Telugu Devotional, Gomatha, Luck-Telugu Bhakthi

పంట పొలం

Telugu Devotional, Gomatha, Luck-Telugu Bhakthi

గరుడ పురాణం ప్రకారం.మనం వెళ్లే దారిలో పంట పొలాన్ని చూడటం శుభ సంకేతం.ఆ పంట అప్పటికే పండిన దైతే.

అది మరింత శుభప్రదం.పండిన పంటలతో నిండిన పొలాన్ని చూస్తే మనిషికి పుణ్యంతో పాటు మంచి జరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది.

గోధూళి

గోమూత్రమే కాదు గోధూళిని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.గోవుల మంద వెళ్లేటప్పుడు నేల నుంచి ఎగిసే దుమ్ము పవిత్రమైనదిగా చెబుతారు.

కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు.గోవు, గోమూత్రం, గోధూళి, పంట పొలం.

ఒకరోజులో ఈ నాలుగింటిని చూసినట్లయితే ఆ వ్యక్తులకు శుభం కలుగుతుంది.వారికి ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుందని నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube