మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండుగ( Diwali celebration )ను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున వచ్చే ఈ పండుగా రోజు కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.
దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడిని పూజిస్తారు.నిర్మలమైన హృదయంతో నియమ నిష్ఠలతో లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు.
అయితే దీపావళి రోజున హిందువులు తమ ఇంటిలో పూజలు చేయడమే కాకుండా ఈ దేవాలయాలను కూడా సందర్శిస్తారు.దీపావళి రోజున దేశంలోని ఏ దేవాలయాలను దర్శించుకోవడానికి భక్తులు వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి రోజు అయోధ్య నగరం పెళ్లి కూతురులా ముస్తాబు అవుతుంది.యూపీలోని అయోధ్య రాముడి( Ayodhya ) జన్మస్థలం కూడా.ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు చూడడానికి రెండు కళ్ళు చాలవు అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది.రామ్ లల్లా దర్శనంతో పాటు సరయూ నది కి కూడా వెళ్ళవచ్చు.అంతే కాకుండా ప్రపంచంలో అతి పురాతనమైన ఆధ్యాత్మిక నగరం వారణాసి.
కాశి నగరం శంకరుని త్రిశూలం కోన పై ఉందని విశ్వాసం.ఇక్కడ జరిగే దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
దీపావళి రోజున కాశీ విశ్వనాథ( Kashi Vishwanath ) జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ప్రజలు భారీగా తరలి వస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మధ్యప్రదేశ్ లోని రత్లామ్‌లో ప్రసిద్ధ మహాలక్ష్మి దేవాలయం ఉంది.ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దీపావళి రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.ధన్‌తేరస్ నుంచి దీపావళి వరకు అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఆభరణాలను సమర్పిస్తారు.
దీపావళి రోజున ఈ దేవాలయానికి వచ్చినా ఏ భక్తుడు ఖాళీ చేతులతో తిరిగి రాడు.దీపావళి సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన నగలను, అభరణాలను ప్రసాదంగా భక్తులకు పంచుతారు.
APP BREAKING NEWS







