విశాఖ నేత పంచకర్ల రమేశ్ జనసేన పార్టీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇప్పటికే జనసేన నేతలతో చర్చలు పూర్తి అయ్యాయని సమాచారం.
ఇందులో భాగంగానే పెందుర్తిలో తన అనుచరులతో రమేశ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలోనే భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
జనసేనలో చేరిన అనంతరం పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రమేశ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.కాగా పార్టీలో చేరిక అంశంపై ఈనెల 17వ తేదీ తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రమేశ్ కలిసే అవకాశం ఉంది.
అయితే ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.







