కేసీఆర్ కు ఓటు వేయొద్దు.. ఈటల రాజేందర్

తెలంగాణ ప్రజలు ఎవరూ ఈ సారి కేసీఆర్ కు ఓటు వేయొద్దని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

 Don't Vote For Kcr.. Etala Rajender-TeluguStop.com

కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితులు వచ్చాయన్న ఆయన వారి కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.ధరణి వచ్చాక బ్రోకర్లు పెరిగిపోగా… పేదల భూములు మాయం అయిపోయాయని ఆరోపించారు.

ధరణి కేసీఆర్ కు డబ్బుల పంట పండించిందన్నారు.సర్వే సంస్థలకు అందనివిధంగా రేపు ప్రజా తీర్పు ఉంటుందని ఈటల తెలిపారు.

మళ్లీ కేసీఆర్ వస్తే ప్రజలు జీవితాలు ఆగమేనని తేల్చి చెప్పారు.తెలంగాణలో ప్రజా సమస్యలు పరిష్కరించి పక్క రాష్ట్రాలకు వెళ్లండని సూచించారు.

బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube