రామ్ చరణ్.( Ram Charan ) ఉపాసన( Upasana ) దంపతుల ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు.
వీరి బేబీ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.రామ్ చరణ్ బేబీ పేరు( Ram Charan Daughter Name ) మొదలుకుని ఫోటో వరకు ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
తాజాగా రామ్ చరణ్ తన కూతురుకు తాత చిరంజీవి మరియు నానమ్మ సురేఖ పేరు కలిసే విధంగా ఒక పేరును సెలక్ట్ చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.మరో వైపు రామ్ చరణ్ మరియు ఉపాసన పేర్లు కలిసే విధంగా ఒక పేరును ఎంపిక చేశారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొత్తానికి పేరు విషయంలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది.పుట్టబోయేది పాప అని తెలిసి ముందుగానే చరణ్ దంపతులు పేరును ఖరారు చేయడం జరిగింది.

ఆ పేరును పాప 21 వ రోజున ఒక చిన్న పాటి ఫంక్షన్ ను నిర్వహించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఈ విషయమై ప్రస్తుతం జరుగుతున్న చర్చలు మరియు వార్తలు అన్నీ కూడా పుకార్లే అంటూ మెగా కాంపౌండ్ నుండి క్లారిటీ వస్తుంది.ఎవరూ ఊహించని విధంగా పేరు ఉంటుంది అంటూ చాలా నమ్మకంగా మెగా కాంపౌండ్ కు చెందిన వారు అంటున్నారు.అతి త్వరలోనే రామ్ చరణ్ మరియు ఉపాసన యొక్క బేబీ గర్ల్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.
మొన్న చరణ్ కూడా మీడియా తో మాట్లాడుతూ పేరు అనుకున్నాం.

అది ఎప్పుడు పెట్టాలి అనేది నిర్ణయించుకోలేదు.పేరు పెట్టిన తర్వాత వెంటనే మీడియా ద్వారా అందరికి తెలియజేస్తాను అన్నట్లుగా పేర్కొన్నాడు.ఇక చరణ్ సినిమా ల విషయాని కి వస్తే గేమ్ ఛేంజర్ షూటింగ్ దశలో ఉంది.
శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అందుకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు.వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.అయితే బిడ్డ జన్మించడంతో నెల రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకుంటూ చరణ్ నిర్ణయం తీసుకున్నాడు.