రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదన్నదే తమ ఆలోచన అని చెప్పారు.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే వికేంద్రీకరణకు నిర్ణయమన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతోనైనా చంద్రబాబుకు బుద్ధి రావాలని వెల్లడించారు.
మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టించడం చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.అదేవిధంగా తాము అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కావాలని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.