కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ల ఫేస్ లు ఉన్నట్టుండి మారిపోతూ ఉంటాయి.మామూలుగా వాళ్ళని మేకప్ లేనప్పుడు చూడటమే చాలా కష్టం.
అలాంటిది వారి ఫేస్ లకు ఏదైనా అవుతే మాత్రం అసలే చూడాలనిపించదు.ఆ ఫేసులు చూస్తే వీళ్ళు ఎలా హీరోయిన్స్ అయ్యారు రా బాబోయ్ అని అనిపిస్తుంది.
ఇక వాళ్ళ ఫేస్ ఉన్నట్టుండి మారడంతో వీళ్లకు ఏమైనా జరిగిందా.లేదా మేకప్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటివి కలిగాయా అన్నట్లు అనిపిస్తుంది.
తాజాగా శృతిహాసన్ ఫేస్ చూస్తే కూడా అలాగే మారింది.ఇంతకు ఆమెకి ఏం జరిగింది అని అనుమానాలు వస్తున్నాయి.
ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్.
ఈమె భారత నటుడు కమల్ హాసన్ కూతురు. ఈయన తన కూతురు శృతిహాసన్ ను చిన్న వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
దాంతో శృతిహాసన్ బాలనటిగా అడుగుపెట్టి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది.
ఇక శృతి సింగర్ కూడా.
పలు సినిమాలలో పాటలు పాడి తన పాటలతో అందరిని ఆకట్టుకుంది.ఇక ఈమె తొలిసారిగా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయమైంది.
తెలుగు ఇండస్ట్రీకి మాత్రం అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

తెలుగు, హిందీలోనే కాకుండా తమిళంలో కూడా నటించింది.ఇక శృతిహాసన్ వ్యక్తిగతంగా మాత్రం బాగా వార్తల్లో నిలిచింది.చాలావరకు తన ప్రేమ విషయంలోనే ఈమె ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా నిలిచింది.వాటి వల్ల తను కొన్ని రోజులు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది.ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలు అందుకుంది.
ఇక శృతి ప్రస్తుతం శాంతాను హజారికా అనే ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.
అతనితో కలిసి జీవిస్తుంది.చాలాసార్లు ఈమె తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
అంతేకాకుండా వీరిద్దరు రోడ్లపై కొచ్చి బాగా హల్ చల్ కూడా చేస్తుంటారు.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది శృతి.

అయితే తాజాగా తను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అయితే అందులో ఒక ఫోటో మాత్రం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.పంచుకున్న అన్ని ఫోటోలలో ఈ ఫోటో కాస్త భిన్నంగా ఉంది.అందులో తన కళ్ళు, తన ముక్కు మొత్తం మారిపోయినట్లుగా కనిపించింది.ఈమెకు ఏమైనా అయ్యిందా అని అసలు ఇలా ఎందుకు కనిపిస్తుంది అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో మాత్రం బాగా వైరల్ అవుతుంది.







